Begin typing your search above and press return to search.

భారత ఆర్మీ సంచలనం..ఫేస్ బుక్ సహా 89 యాప్ లపై నిషేధం

By:  Tupaki Desk   |   9 July 2020 8:15 AM GMT
భారత ఆర్మీ సంచలనం..ఫేస్ బుక్ సహా 89 యాప్ లపై నిషేధం
X
ఇటీవలే చైనాకు చెందిన 50 యాప్ లను నిషేధించిన భారత ప్రభుత్వ నిర్ణయం సంచలనమైంది. అయితే ఇవన్నీ మనతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనావే కావడంతో అందరూ శభాష్ అన్నారు. మన దేశ రక్షణ, భద్రతాపరంగా ముప్పు కావడంతో సమర్థించారు.

ఇప్పుడు అదే బాటలో భారత ఆర్మీ కూడా చేసింది. తాజాగా ఇండియన్ ఆర్మీ అమెరికాకు చెందిన ఫేస్ బుక్ తో సహా మొత్తం 89 యాప్ లపై నిషేధం విధించింది. నిషేధించిన 89 రకాల యాప్ లను ఇండియన్ ఆర్మీ ఎక్కడా వాడదు. సైనికులు తీసేయాలి. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాటిని తీసేయాలని ఆదేశించింది.

జులై 15వ తేదీలోగా ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని తన 13 లక్షలమంది ఆర్మీకి ఇండియన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది.

కాగా దేశ రక్షణలో కీలకమైన సైనికులను ఫేస్ బుక్ సహా కొన్ని యాప్స్ ద్వారా పాకిస్తాన్ అమ్మాయిల పేరుతో వలవేస్తోందని.. రక్షణ రహస్యాలు తెలుసుకుంటుందని వెల్లడైంది. అందుకే ఫేస్ బుక్ సహా 89 యాప్స్ ను ఇండియన్ ఆర్మీ నిషేధించింది.