Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం..

By:  Tupaki Desk   |   25 Sep 2018 9:52 AM GMT
పాకిస్తాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం..
X
పాకిస్తాన్ పై మరోమారు సర్జికల్ స్రైక్ కు వెనుకాడబోమని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యంతోపాటు నిఘా సంస్థ ఐఎస్ఐ ను అదుపులో ఉంచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చాడు. పాక్ భూభాగంపై దండెత్తడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.

గురువారం ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు - ఒక కానిస్టేబుల్ ను అపహరించిన పాక్ ఉగ్రవాదులు వారిని దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.. అంతకుముందే సరిహద్దుల్లో ఓ జవాన్ ను పాకిస్తాన్ ఆర్మీ కాల్చి చంపింది. ఇదంతా పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు కలిసి చేస్తున్న కుట్ర అని భారత్ ఆరోపిస్తోంది. అందుకే తాజాగా న్యూయార్క్ లో పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మెహమూద్ ఖురేషీ - భారత విదేశాంత మంత్రి సుష్మా స్వరాజ్ మధ్య జరగాల్సిన సమావేశాన్ని భారత్ రద్దు చేసుకుంది.

ఇలా భారత్ బలగాలపై దాడుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఢిల్లీ విలేకరులతో మాట్లాడారు. సరిహద్దుల్లో భారత సైనికులతో పోరాడలేక అన్యాయంగా పోలీస్ ఆఫీసర్లను ఎత్తుకెళుతూ వారిని దారుణంగా చంపుతున్నారని బిపిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనాన్ని - ఐఎస్ ఐను ఇప్పటికైనా పాక్ ప్రభుత్వం అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని పాకిస్తాన్ కు ఘాటు హెచ్చరికలు చేశారు.