Begin typing your search above and press return to search.
చైనా దుస్సాహసం.. భారత ఆర్మీ కల్నల్, ఇద్దరు జవాన్లు మృతి ,స్పందించిన కేంద్రం!
By: Tupaki Desk | 16 Jun 2020 12:10 PM GMTభారత్, చైనా సరిహద్దు మళ్లీ రణరంగంగా మారింది. ఇరు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు చర్చలు జరిపిన తర్వాత ఉద్రిక్తతలు కాస్త తగ్గాయని.. LAC నుంచి బలగాలు వెనక్కి వెళ్తున్నాయని వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే లద్దాఖ్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. చైనా మరోసారి భారత్‌ను దొంగదెబ్బ కొట్టింది. చర్చలు కొనసాగిస్తూనే దాడులకు పాల్పడుతోంది. మంగళవారం లఢక్ సమీపంలోని గాల్వన వ్యాలీ సమీపంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో భారత్ కు చెందిన ముగ్గురు జవాన్లు అమరులు అయ్యారు. మరణించిన వారిలో ఓ కమాండింగ్ అధికారి ఉన్నారు. ఈ ఘటనతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎలాంటి ముందుస్తు హెచ్చరికలు లేకుండా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల ఉదంతంలో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. భారత్ తరఫున కల్నల్ స్థాయి ర్యాంకు గల కమాండింగ్ అధికారి, ఇద్దరు జవాన్లు అమరులు అయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు. అలాగే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు మరణించినట్లు ప్రకటించింది. ఎంతమంది మరణించారనే విషయాన్ని ఆర్మీ అధికారులు స్పష్టం చేయలేదు. ఈ దిశగా సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు వెల్లడించారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ తో సమావేశం అయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా ఇదే సమావేశానికి హాజరయ్యారు. సరిహద్దుల్లో ప్రాణనష్టానికి దారి తీసిన పరిణామాలపై చర్చిస్తున్నారు. చైనా పై ఎలాంటి వైఖరిని అనుసరించాలనే అంశంపై ప్రధానంగా వారి మధ్య చర్చకు వచ్చింది. ఈ మద్యే మొదటి దశ చర్చలు ముగిసాయి. మరి కొద్దిరోజుల్లో రెండో దఫా చర్చలు కొనసాగాల్సి ఉంది. అదే సమయంలో రెండు దేశాల సరిహద్దు సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం ముగ్గురు మరణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనితో రెండోదశ చర్చల పై అనుమానం నెలకొంది. ఈ ఘర్షణల పర్యవసానం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శాంతియుతంగా పరిష్కరించుకోవడంపైనే అటు చైనా, ఇటు భారత్ కట్టుబడి ఉన్నట్లు ఆయా దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు
భారత్ చైనా సరిహద్దులు రక్తమోడే పరిస్థితికి చేరుకోవడం 1975 తరువాత ఇదే తొలిసారి. అప్పట్లో కూడా చైనా సరిహద్దు వివాదాలను రేకెత్తించింది. దాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ చేసిన ప్రయత్నాలు అప్పట్లోనూ వ్యర్థం అయ్యాయి. ఫలితంగా రెండు దేశాల సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తులుంగ్ లా ప్రాంతంలో జరిగిన ఆ ఘర్షణలో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి