Begin typing your search above and press return to search.
భారత సైన్యం మరో సర్జికల్ స్ట్రైక్స్
By: Tupaki Desk | 16 March 2019 10:17 AM GMTసర్జికల్ స్ట్రైక్స్.. ఇప్పుడు ఈ పేరు వింటేనే భారతావని ఉద్వేగంతో పొంగిపోతుంది. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ అక్కడి ఉగ్రమూకలను తుదముట్టించిన భారత సైనికుల సర్జికల్ స్ట్రైక్స్ ను అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు మూడో సర్జికల్ స్ట్కైక్స్ కూడా భారత ఆర్మీ చేపట్టింది. కానీ అది పాకిస్తాన్ భూభాగంపై కాదు.. భారత దేశానికి తూర్పున ఆనుకొని ఉన్న మయన్మార్ భూభాగంలో.. అవును భారత దళాలు మయన్మార్ లో తిష్టవేసిన ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ చేశాయి. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.
ఫిబ్రవరి 17 నుంచి మార్చి 2 వరకు భారత్-మయన్మార్ దేశాల సైన్యాలు కలిసి మరో సర్జికల్ స్ట్రైక్స్ చేశాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న కలాదాన్ ప్రాజెక్టును ధ్వంసం చేయడానికి మయన్మార్ కు చెందిన అకారన్ అనే ఉగ్రవాద సంస్థ కుట్రలు చేసింది. భారత దేశంలోని మిజోరం రాష్ట్ర సరిహద్దుల్లో కూడా వీరు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని భారత ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించింది. దీంతో ఇరు దేశాల సైనికులు ‘ఆపరేషన్ సన్ రైస్’ పేరిట గుట్టుచప్పుడు కాకుండా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయి.
ఈ స్ట్రైక్స్ లో మిజోరంలోని 10 ఉగ్రస్థావరాలు నేలకూలాయి. రెండు వారాల పాటు సాగిన ఈ ఉగ్రవాదుల వేటలో వందల మంది ఉగ్రవాదులు మరణించారు. భారత సైనికులు మయన్మార్ సరిహద్దులు దాటకుండా ఆపరేషన్ లో పాల్గొన్నారని.. అస్సాం రైఫిల్స్ తోపాటు ప్రత్యేక బలగాలు ఇటు వైపు ఆపరేషన్ లో పాల్గొన్నాయని భారత్ పేర్కొంది. దీన్ని సర్జికల్ స్ట్రైక్స్ 3గా పేర్కొన్నాయి.
ఇక అటువైపు మయన్మార్ సైన్యం కూడా సర్జికల్ స్ట్రైక్ చేశాయి. దీంతో భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఉగ్రవాదులు హతమయ్యారు. శిబిరాలు నేలమట్టమయ్యాయి.
కోల్ కతాలోని భారత ఓడరేవును మయన్మార్ లోని సిత్ వే ఓడరేవుతో అనుసంధానం చేసేందుకు ఈ ప్రతిష్టాత్మక ‘కలదాన్ ’ ప్రాజెక్టును చేపట్టారు. ఇది పూర్తి అయితే భారత్ నుంచి దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాలకు రవాణా మార్గం సులభం అవుతుంది. దీంతో కోల్ కతా నుంచి మిజోరం మీదుగా నాలుగు రోజుల ప్రయాణం.. దాదాపు వెయ్యి కిలోమీటలర్ల దూరం తగ్గుతుంది. ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కట్టకుండా ఉగ్రవాదులు పేల్చేయడానికి కుట్రపన్నగా భారత, మయన్మార్ సైన్యాలు సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాదులను తుదముట్టించాయి.