Begin typing your search above and press return to search.
మన ఆర్మీ మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేసిందా?
By: Tupaki Desk | 26 Dec 2017 8:03 AM GMTమన ఆర్మీ మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేసిందా? పాక్ కు బుద్ధి చెప్పేందుకు మళ్లీ కీలక చర్యకు పాల్పడిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్ కు ఇండియన్ ఆర్మీ గట్టిగా బదులిచ్చింది. భారత బలగాలు సోమవారం నియంత్రణ రేఖను దాటి పీవోకేలో ప్రవేశించి కాల్పులు జరిపాయి. ఆ కాల్పుల్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతిచెందారు. మరో పాకిస్థాన్ సైనికుడు కూడా గాయపడ్డట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. శనివారం ఎల్వోసీ వద్ద పాక్ దళాలు జరిపిన కాల్పులకు ప్రతీకారంగా భారత భద్రతా దళాలు ఈ చర్యకు దిగాయి. జమ్మూకశ్మీర్ లోని కేరీ సెక్టార్ లో పాక్ విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడింది. అక్కడ భారత బలగాలు ఆ కాల్పులను తిప్పికొట్టాయి. దాంతో ముగ్గురు పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది యూరీ దాడికి ప్రతీకారంగా జరిపిన సర్జికల్ దాడుల తరహాలో భారత ఆర్మీ ఎల్వోసీ దాటి పాక్ దళాలకు బుద్దిచెప్పాయి.
ఎల్వోసీలోకి ప్రవేశించి పాక్ సైనికులను హతమార్చిన భారతీయ ఆర్మీ ఆ ఆపరేషన్‌ను లోకలైజ్డ్ టాక్టికల్ లెవల్ ఆపరేషన్ గా పేర్కొంది. స్థానికంగా ఆ ప్రాంతంలో ఉండే ఆర్మీ కమాండర్ ఆ ఆపరేషన్ ను నిర్వహిస్తాడు. అధికారుల సమాచారం ప్రకారం సుమారు పది మంది ప్రత్యేక దళానికి చెందిన భారతీయ సైనికులు లైన్ ఆఫ్ కంట్రోల్ ను దాటి కాల్పులు జరిపారు. సోమవారం పూంచ్ సెక్టార్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ కాల్పుల్లోనే ముగ్గురు పాక్ సైనికులు మృతిచెందారు. రాజౌరిలో శనివారం పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిలో నలుగురు భారతీయ సైనికులు మృతిచెందారు. ఆ ఘటనకు ప్రతీకారంగా ఈ దాడులు చేశారు.
అయితే ఈ ఆపరేషన్ ను సర్జికల్ దాడిగా అధికారులు వర్ణించలేదు. కేవలం ఎంపిక చేసిన టార్గెట్ ను మాత్రమే నిర్వీర్యం చేసినట్లు అధికారులు చెప్పారు. చాలా స్పష్టమైన లక్ష్యాలను ఈ ఆపరేషన్ ద్వారా ఛేదిస్తారు. అయితే రాత్రి నిర్వహించిన దాడిలో భారతీయ సైనికులు ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. భారత దళాలపై దాడి చేస్తే - ప్రతీకారం ఇలాగే ఉంటుందన్న సంకేతాలను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు.
ఇదిలాఉండగా... పుల్వామా జిల్లాలో భద్రతాబలగాలు - ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా దళాలు కాల్పులు జరిపి మోస్ట్ వాంటెడ్ జైషే యీ మహ్మద్ ఉగ్రవాది నూర్ మహ్మద్ టాంట్రేను హతమార్చాయి. ఎన్ కౌంటర్ స్థలం నుంచి ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ముగ్గురు జేషే యీ మహ్మద్ ఉగ్రవాదులు సాంబూరా సెక్టార్ లో తలదాచుకున్నారని..ఆ ముగ్గురిలో కశ్మీర్ లోయలో జరిగిన పలు దాడుల్లో మాస్టర్ మెండ్ గా ఉన్న నూర్ మహ్మద్ ను హతమార్చామని డీజీపీ ఎస్పీ వైడ్ వెల్లడించారు. మిగిలిన ఇద్దరిని సెర్చ్ ఆపరేషన్ కొసాగిస్తున్నట్లు తెలిపారు.