Begin typing your search above and press return to search.

ఏడుగురు ఆర్మీ జవాన్లు మృతి

By:  Tupaki Desk   |   8 Feb 2022 2:19 PM GMT
ఏడుగురు ఆర్మీ జవాన్లు మృతి
X
అరునాచల్ ప్రదేశ్ లోని కమెంగ్ సెక్టార్ లో సంభవించిన ఆకస్మిక హిమపాతంలో ఏడుగురు సైనికులు గల్లంతైన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు సైనిక ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

19వ జమ్మూకశ్మీర్ రైఫిల్స్ దళానికి చెందిన ఏడుగురు సైనికులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో హిమపాతంలో చిక్కుకుపోయారని సైన్యం సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే.

ఎత్తైన ప్రాంతంలో కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది, నిపుణుల బృందం వారి ఆచూకీ కోసం ముమ్మర సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే నేడు వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.

సముద్రమట్టానికి 14500 అడుగుల ఎత్తులో మృతదేహాలు లభ్యమైనట్లు రక్షణశాఖ ప్రతినిధి లెఫ్ట్ నెంట్ కర్నల్ హర్షవర్ధన్ పాండే వెల్లడించారు.

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్లు మన భద్రత కోసం నిస్వార్థంగా కృషి చేస్తున్నారు.వారికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.