Begin typing your search above and press return to search.
పాక్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇండియా
By: Tupaki Desk | 8 May 2017 6:14 PM GMTజమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఈ నెల 1న కృష్ణ ఘాటీ సెక్టార్ లో ఇద్దరు భారత జవాన్లను పాకిస్థాన్ రేంజర్లు దారుణంగా చంపిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఈ సందర్భంగా పాక్ కు గట్టిగా బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి సహా పలువురు ఆర్మీ అధికారులు ప్రకటించారు. అన్నట్లుగానే పాకిస్థాన్ దుశ్చర్యకు బదులు తీర్చుకున్నారు భారత సైనికులు. కృష్ణఘాటీ సెక్టార్ సమీపంలో ఉన్న పాక్ బంకర్లను ధ్వంసం చేశారు. రాకెట్ లాంచర్ సాయంతో ఒకే ఒక్క నిమిషంలో పాక్ బంకర్ ను పేల్చివేసిన వీడియో వైరల్ గా మారింది. సింగ్ రెజిమెంట్ యూనిట్ ఈ దాడి చేసినట్లు రిటైర్డ్ ఆర్మీ మేజర్ గౌరవ్ ఆర్యా తెలిపారు.
టార్గెట్‌ను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు వీడియోలో జవాన్లు మాట్లాడుకుంటున్న అంశాలను కూడా ఈ వీడియోలో గమనించవచ్చు. ఇద్దరు భారత జవాన్ల హత్యకు ప్రతీకారంగా దాడులు చేస్తామని ఇటీవల ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఆర్మీ ఎప్పుడూ భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించదు అని, ప్రణాళికలు అమలు అయ్యాకే చెబుతుందని ఆయన తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద జవాన్లు నయిబ్ సుబెదార్ పరమ్‌జిత్ సింగ్, ప్రేమ్ సాగర్లను పాక్ రేంజర్లు కిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే.