Begin typing your search above and press return to search.

బుర్హాన్ వ‌నీ వార‌సుడిని లేపేశారు

By:  Tupaki Desk   |   27 May 2017 4:34 PM GMT
బుర్హాన్ వ‌నీ వార‌సుడిని లేపేశారు
X
క‌శ్మీర్ వేర్పాటువాద గ‌ళాన్ని పెద్ద ఎత్తున వినిపిస్తున్న హిజ్బుల్ ముజాహిదిన్‌ కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. హిజ్బుల్‌ క‌మాండ‌ర్ స‌బ్జ‌ర్ అహ్మ‌ద్ భ‌ట్ హ‌త‌మ‌య్యాడు. ఇవాళ క‌శ్మీర్‌ లోని త్రాల్‌ లో జ‌రిగిన ఎన్‌ కౌంట‌ర్‌ లో భ‌ట్ చ‌నిపోయిన‌ట్లు భార‌త సైన్యం ప్ర‌క‌టించింది. వివాదాస్ప‌ద ఉగ్ర‌వాది బుర్హ‌న్‌ వానీ త‌ర్వాత హిబ్బుల్‌ కు భ‌ట్ క‌మాండ‌ర్‌ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. భ‌ట్ త‌ల‌పై 10 ల‌క్ష‌ల రివార్డు ఉంది.

సైన్యం తెలిపిన వివ‌రాల ప్ర‌కానం పుల్వామా జిల్లాలోని త్రాల్‌ లో ఇవాళ ఉద‌యం భీక‌రంగా ఎదురుకాల్పులు జ‌రిగాయి. భ‌ద్ర‌తా ద‌ళాలు ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను చ‌ట్టుముట్టి ఫైరింగ్ జ‌రిపాయి. వాస్త‌వానికి మిలిటెంట్లు శుక్ర‌వారం రాత్రి రాష్ట్రీయ రైఫిల్స్‌ పై ఫైరింగ్‌ కు పాల్ప‌డ్డారు. దీంతో భ‌ద్ర‌తా ద‌ళాలు ఉగ్ర మూల‌క‌ల‌కు దీటుగా ఫైరింగ్‌ కు దిగాయి. సైమోహ్ గ్రామంలో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మోహ‌రించాయి. శ్రీన‌గ‌ర్‌ కు 36 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. భ‌ట్‌తో పాటు మ‌రో ఉగ్ర‌వాది హ‌తం కాగా, మ‌రో మిలిటెంట్ కోసం గాలింపులు జ‌రుగుతున్నాయి.

శుక్ర‌వారం ఉద‌యం నుంచి జ‌మ్మూక‌శ్మీర్‌ లో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఎనిమిది మంది ఉగ్ర‌వాదులు చ‌నిపోయారు. అందులో భ‌ట్‌ తో పాటు అత‌ని అనుచ‌రుడు కూడా ఉన్నారు. రాంపూర్ సెక్టార్‌ లో జ‌రిగిన మ‌రో ఎన్‌ కౌంట‌ర్‌ లో ఆరుగురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. చొర‌బాటు ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునే క్ర‌మంలో ఈ ఎన్‌ కౌంట‌ర్ జ‌రిగింది. కాగా, హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ కూడా భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యాకలాపాలు నిర్వహించాడుచిన సంగ‌తి తెలిసిందే. భారత్ భద్రతా దళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో బుర్హాన్ వనీ అంతం అయ్యాడు. అప్ప‌టినుంచి క‌శ్మీర్‌లో అల‌జ‌డి నెల‌కొంది.