Begin typing your search above and press return to search.

క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల‌తో సైనికుల 'వార్'!

By:  Tupaki Desk   |   1 April 2018 8:00 AM GMT
క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల‌తో సైనికుల వార్!
X
దేశంలోకి అక్ర‌మంగా ఉగ్ర‌వాదుల్ని పంప‌టం ద్వారా.. భార‌త్ లో శాంతి అన్న‌ది లేకుండా చేయాల‌న్న కుయుక్తిని సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది. ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేనంత‌గా పెద్ద ఎత్తున ఉగ్ర‌వాదుల్ని జ‌మ్ముక‌శ్మీర్ లో ఎన్ కౌంట‌ర్లు చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు.. ఉగ్ర‌వాదుల మ‌ధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జ‌రిగాయి.

ఈ ఘ‌ట‌న‌ల్లో 8 మంది తీవ్ర‌వాదుల్ని జ‌వాన్లు మ‌ట్టుబెట్టారు. షోపియాన్ జిల్లాలో గ్ర‌డాద్ లో త‌నిఖీలు చేస్తున్న జ‌వాన్ల‌పై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. వెంట‌నే రియాక్ట్ అయిన జ‌వాన్లు అంతే ధీటుగా ఎదురుకాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో 7 మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఉగ్ర‌వాదుల వెంట పెద్దఎత్తున ఆయుధాలు.. పేలుడు ప‌దార్థాలు ల‌భించాయి. ఇదిలా ఉండ‌గా..అనంత్ నాగ్ జిల్లాలోని దియాల్గ‌మ్ లో మ‌రో ఎన్ కౌంట‌ర్ చోటు చేసుకుంది.ఇక్క‌డ ఒక ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యారు.

ఇదిలా ఉండ‌గా సోపియాన్ జిల్లా క‌చ్ దూర‌లో ఎదురు కాల్పులు సాగుతున్నాయి. ఇక్క‌డ న‌లుగురు సాధార‌ణ పౌరుల్ని ఉగ్ర‌వాదులు బంధీలుగా చేసుకొన్న‌ట్లుగా చెబుతున్నారు. ఎదురుకాల్పుల నేప‌థ్యంలో ముంద‌స్తుగా బ‌నిహ‌ల్.. శ్రీ‌న‌గ‌ర్ మ‌ధ్య రైలు స‌ర్వీసును నిలిపివేశారు. లేనిపోని అస‌త్యాలు వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు వీలుగా ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపివేశారు. ఈ మ‌ధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఎన్ కౌంట‌ర్ జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నారు. ఉగ్ర‌వాదుల‌పై సైనికులు జ‌రిపిన కాల్పుల సంద‌ర్భంగా ఇద్ద‌రు జ‌వాన్ల‌కు గాయాలు అయిన‌ట్లుగా తెలుస్తోంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌మ్ముక‌శ్మీర్ వ్యాప్తంగా భ‌ద్ర‌తా సిబ్బంది అలెర్ట్ అయ్యింది.