Begin typing your search above and press return to search.
మంచుకొండల్లో విచిత్ర మనిషి 'యతి'
By: Tupaki Desk | 30 April 2019 7:52 AM GMTహిమాలయాలు.. అంతుచిక్కని పర్వతాలు.. ఇక్కడ ఎన్నో విశిక్ష మూలికలు, విచిత్ర జంతువులు.. సంజీవని ఉందని పూరాణాల్లో రాశారు. కానీ వాటిని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కానీ ఎంతో మంది విదేశీయులు, ఫేమస్ యూనివర్సిటీల పరిశోధకులు మాత్రం హిమాలయాల్లోని కొన్ని అద్భుతాలు వాస్తవాలంటూ పేర్కొన్నారు.
హిమాలయాల్లో మనిషి, కోతి కలగలిసి ఉండే భీకార ఆకారంలో ‘యతి’ పేరుతో మంచుమనిషి హిమాలయాల్లో కనిపిస్తాడని అక్కడ నివసించే షెర్పాలు అనే తెగ కథలు కథలుగా చెబుతున్నారు. హిమాలయాల్లో సంచరించే భారీ కాయం గల ఈ మంచు మనిషి అసలు ఉన్నాడా లేదా అన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అంచుచిక్కలేదు.
అయితే తాజాగా ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ‘యతి’ జాడపై మళ్లీ చర్చకు దారితీసింది. హిమాలయాల్లో పర్వతారోహణకు వెళ్లిన భారత సైనికులకు మంచు మనిషి యతి పాదముద్రలు కనిపించాయట.. ఏప్రిల్ 9న ఓ ఆర్మీ టీం హిమాలయ పర్వతాల్లోని మకలు బేస్ క్యాంప్ నకు వెళ్లింది. మకలు బరూన్ నేషనల్ పార్క్ లోని మంచుకొండల్లో యతి లాంటి మంచుమనిషి పాదముద్రలను ఆర్మీ సభ్యులు గుర్తించారు. ఆ పాదముద్రల్ని ఫొటోలు తీసి తమ ఆర్మీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాదాపు 32 అంగుళాల పొడువు, 15 అంగుళాల వెడల్పు ఉన్నట్టు అదిపెద్ద మంచుమనిషి అని గుర్తించారు. మంచుకొండల్లో యతి సంచారం ఉందని ఆర్మీ అధికారులు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.
దీంతో హిమాలయాల్లో అదృశ్య మంచు మనుషులు ఉన్నట్టు మరోసారి కథనాలు వెలువడ్డాయి. చాలా ఏళ్లుగా దీనిపై పరిశోధకులు - శాస్త్రజ్ఞులు చెబుతున్న మాటలకు యతి పాదముద్రలు బలం చేకూరుస్తున్నాయి. ఇదివరకే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ జెనెటిక్స్ ప్రొఫెసర్ బ్రయాన్ సైక్స్ హిమాలయాల్లో కాల్పనిక జీవి యతి ఉన్నాడని ప్రకటించారు. దీని వెంట్రుకలపై పరిశోధన చేసి ఇది లక్షా ఇరవై ఏళ్ల నాటి పురాతన ధ్రువపు ఎలుగుబంటి డీఎన్ ఏను పోలి ఉందని తేల్చిచెప్పాడు. ఇప్పుడు తాజా ఫొటోలతో మరోసారి మంచుమనిషి పై చర్చ జరుగుతోంది.