Begin typing your search above and press return to search.
ఆపరేషన్ జింజర్ తో పాక్ తాట తీశారట!
By: Tupaki Desk | 10 Oct 2016 9:56 AM GMTదాయాది పాక్ పై భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిందన్న వార్తల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు చిత్రమైన వాదనలు తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోఉన్నప్పుడు కూడా పాక్ పై సర్జికల్ దాడులు చేసినట్లుగా చెప్పుకొంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం.. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ గా రాజకీయ నేతలు.. మాజీ సైనిక ఉన్నతాధికారులు అదంతా ఉత్త ప్రచారంగా తీసి పారేస్తున్న వేళ.. ఆసక్తికరమైన అంశం ఒకటి తెర మీదకు వచ్చింది.
కాంగ్రెస్ నేతలు కొందరు చెప్పినట్లే పాక్ మీద సర్జికల్ దాడులు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ దాడులు 2011లోనే జరిగాయంటూ ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక సంచలన కథనాన్ని తాజాగా ప్రచురించింది. విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటూ.. అనవసరమైన హడావుడిని ప్రదర్శించని సదరు మీడియా సంస్థకు చెందిన కథనం కావటంతో పలువురి దృష్టి ఈ కథనం మీద పడుతున్న పరిస్థితి.
ఆపరేషన్ జింజర్ పేరిట జరిపిన ఈ సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియో.. ఫోటోల్నిబయటపెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. పాక్ పై భారత్ జరిపిన నాటి సర్జికల్ దాడులకు సంబంధించిన వివరాల్ని చూసినప్పుడు.. 2011లో కుప్వారా జిల్లాలోని గుగల్దార్ పోస్టుపై పాక్ సైనికులు విరుచుకుపడ్డారని..ఈ సందర్భంగా భారత్ కు చెందిన ఐదుగురు సైనికులను దారుణంగా హత్య చేసి..తలలు నరికేశారని సదరు కథనంలో పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు తలల్ని పాక్ సైనికులు తమ వెంట తీసుకెళ్లారని పేర్కొంది.
దీనికి ప్రతీకారంగా భారత సైనికులు 2011 ఆగస్టు 30న ఆపరేషన్ జింజర్ పేరుతో సర్జికల్ దాడులు చేపట్టినట్లుగా పేర్కొంది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ భూభాగంపై దాడికి దిగినట్లుగా పేర్కొన్నారు. ఈ దాడుల్లో పాక్ కు చెందిన 8 మంది సైనికుల్ని చంపి.. వారిలో ముగ్గురు తలల్ని భారత్ కు తెచ్చినట్లుగా సదరు కథనం పేర్కొంది. తాజా కథనంతో పాక్ మీద కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సర్జికల్ దాడులు జరిగినట్లుగా చెబుతున్నారు. మరీ.. ఆపరేషన్ జింజర్ ను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఎందుకు మౌనంగా ఉన్నట్లు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/