Begin typing your search above and press return to search.
మన సైనికులు ముగ్గుర్ని ఏసేశారు
By: Tupaki Desk | 12 July 2017 8:54 AM GMTఅమర్ నాథ్ యాత్రకు వెళ్లి వస్తున్న భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయటం.. ఇందులో ఏడుగురు ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. యావద్దేశాన్ని ఆగ్రహానికి గురి చేసిన ఈ ఉగ్రఘటనపై కౌంటర్ ఎటాక్ కు సైన్యం సిద్ధమైంది. జమ్మూకాశ్మీర్ లో దాగిన ఉగ్రవాదుల్ని ఏరి పారేయటానికి ప్రత్యేక ఆపరేషన్ షురూ చేసింది.
అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర సర్కారు ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యింది. విపక్షాలతో పాటు మిత్రులుగా వ్యవహరించే వీహెచ్ పీ సైతం మోడీ సర్కారు తీరుపై విరుచుకుపడింది. తాజా పరిణామాల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ లోని ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా జరిపిన తనికీల్లో బుద్గాం జిల్లాలోని మంగళవారంరాత్రి ఉగ్రవాదులు.. సైనికులకు మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. రాష్ట్రీయ రైఫిల్స్.. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్.. జమ్ముకాశ్మీర్ పోలీసులు.. సెంట్రల్ రిజర్వ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఎన్ కౌంటర్ చేపట్టారు.
ఉగ్రవాదుల కదలికల మీద పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు బుద్గాంను జల్లెడ పట్టాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు.. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఏరివేతను మరింత ఎక్కువగా చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.