Begin typing your search above and press return to search.

హీరోయిజం; ఆర్మీవోళ్లా.. మజాకానా..?

By:  Tupaki Desk   |   15 July 2015 9:17 PM GMT
హీరోయిజం; ఆర్మీవోళ్లా.. మజాకానా..?
X
కొన్నిసీన్లు తెర మీద మాత్రమే కనిపిస్తాయి. రీల్ లైఫ్ లో కనిపించే సీన్లు రియల్ లైఫ్ లో దర్శనమిచ్చే అవకాశాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే మహారాష్ట్రలోని షిర్డీ రోడ్డు మీద జరిగింది.

మహారాష్ట్రలోని రాహురి సమీపంలోని షిర్డీ రోడ్డు మీద ఒక భారీ వాహనం తలకిందుల పడిపోయింది. ఆ భారీ వాహనంలో ఒక వ్యక్తి ఇరుక్కుపోయాడు. సాయం కోసం అరుస్తున్నాడు. అటువైపు వెళ్తున్నవారు ఆగి.. చూస్తున్నారే తప్పించి.. ఏం చేయాలో తోచని పరిస్థతి. ఇంతలో.. ఆ దారి వెంటే ఒక ఆర్మీ వాహనం వెళుతోంది.

అందులో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్నారు. భారీ వాహనం బోల్తా పడటం గమనించిన వారు తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపేసి.. కిందకు దిగారు. పరిస్థితి పరిశీలించారు. వెంటనే సిట్యూవేషన్ ను తమ చేతుల్లోకి తీసుకున్న వారు.. ఆ వ్యక్తిని రక్షించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. భారీ వాహనాలు అడ్డదిడ్డంగా పడిపోతే.. వాటిని తీసేందుకు భారీ క్రేన్ లు ఉపయోగిస్తుంటారు. అలాంటివేమీ లేకున్నా.. పెద్దగా ఆలోచించని ఆర్మీజవాన్లు.. ఒట్టి చేతలతో అంత పెద్ద వాహనాన్ని అవలీలగా ఎత్తేసి నిలబెట్టేశారు.

సదరు వాహనంలోఇరుక్కున్న వ్యక్తిని కాపాడారు. ఈ మొత్తం ఘటనను చూస్తున్న వారంతా ఆర్మీవాళ్ల సాహసాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. ఆర్మీవోళ్లు.. ఆర్మీవోళ్లే అంటూ ప్రశంసలు

Video Link : https://www.youtube.com/watch?v=MxYsjzclCzA