Begin typing your search above and press return to search.
సరిహద్దుల్లో పాక్ పై సర్జికల్ తరహా దాడులు
By: Tupaki Desk | 23 May 2017 12:15 PM GMTమరో సంచలనం చోటు చేసుకుంది. పాకిస్థాన్ చెడు బుద్ధులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది భారత సైన్యం. ఓపికతో.. సహనంతో.. శాంతితో ఉన్నప్పటికీ.. నిత్యం ఏదో రకంగా కెలికే పాకిస్థాన్‌కు మరోసారి దిమ్మ తిరిగిపోయేలా బలమైన సమాధానం ఇచ్చాయి భారత్ సైనిక దళాలు. సరిహద్దుల్లో పాగా వేసి.. చొరబాట్లకు సాయంగా నిలుస్తున్న పాక్ శిబిరాల్ని భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ దాడులతో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్థానీ శిబిరాలు పూర్తిగా నాశనమైనట్లుగా తెలుస్తోంది.
ఈ నెల 20.. 21 తేదీల్లో జరిపిన ఈ దాడుల గురించి భారత సైన్యం తాజాగా సంచలన ప్రకటన చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని నౌషేరా ప్రాంత సమీపంలో ఉన్న పాక్ శిబిరాలపై భారత భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. శిబిరాలపై భారీ ఎత్తున కాల్పులు జరిపాయి. దీంతో.. అక్కడి పాకిస్థానీ శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతానికి నియంత్రణ రేఖ ప్రాంతం మొత్తం భారత సైన్యం అధీనంలోనే ఉందని.. తమకు జమ్ముకశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడటమే ముఖ్య ఉద్దేశంగా చెప్పారు.
మాటలు మాత్రమే చెప్పకుండా.. తమ వాదనకు బలమైన సాక్ష్యాల్ని చూపిస్తూ.. పాకిస్థానీ బంకర్లను ధ్వంసం చేసిన దృశ్యాలున్న వీడియోను కూడా ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజనర్ జనరల్ అశోక్ నరులా వెల్లడించారు. కొండల్లో ఉన్న మంచు కరుగుతూ భారత్ వైపు రావటానికి అవకాశాలు పెరిగిపోవటంతో చొరబాట్లు అధికంగా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
చేతులు కాలాక ఆకులు పట్టుకునే కన్నా.. ఒక అడుగు ముందుకేసిన భారత సైన్యం పాక్ శిబిరాల్ని పూర్తిస్థాయిలో ధ్వంసం చేసింది. భారత్ లోకి చొరబాట్లను ప్రేరేపించేందుకు వీలుగా పాక్ పావులు కదిపిన సమాచారం పూర్తిగా తెలుసుకొన్నాక.. పరిశీలన జరిపి మరీ దాడులు నిర్వహించినట్లుగా ఆర్మీ వెల్లడించటం విశేషం. పాక్ పై తాజా దాడులు ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.