Begin typing your search above and press return to search.
పాక్ పిచ్చి వాదనలకు ఇండియన్ ఆర్మీ పంచ్!
By: Tupaki Desk | 6 Oct 2016 4:56 AM GMTసర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఇన్ని రోజులైంది, ఆ దాడికి సంబందించిన సంభరాలు భారతీయ ప్రజలు జరుపుకోగా, వాటికి సంబందించిన విమర్శలు పాక్ కు సంబందించిన వివిద వర్గాల నుంచి వినిపించాయి. అయితే ఈ విషయంలో అలాంటివేమీ జరగలేదని మాత్రం పాక్ మిడియా కోడై కూస్తోంది. ఎలాంటి దాడీ జరగలేదు, ఉగ్రవాదులెవరూ చనిపోలేదు, భారత సైన్యం డ్రామాలాడుతుంది వంటి ఆరోపణలు పాక్ మీడియా నుంచి నేటికీ వినిపీస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇక ఈ పిచ్చి వాదనలకు - ఆరోపణలకు ఇండియన్ ఆర్మీ బ్రేక్ వేయబోతుంది. ఈ మేరకు సర్జికల్ స్ట్రైక్స్ కి సంబందించిన వీడియో క్లిప్పింగులను కేంద్ర ప్రభుత్వానికి సైన్యం అప్పగించిందని తెలుస్తోంది!!
దాడుల్లో మృతి చెందిన వారిని ట్రక్కుల్లో తరలిస్తున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షుల సమాచారం కూడా పక్కాగా ఉందని ఇప్పటికే ప్రముఖ జాతియ పత్రికలో కథనాలు వచ్చాయి. అయినా కూడా పాక్ మీడియా వెనక్కి తగ్గకపోవడంతో... వీరి పిచ్చి ప్రేలాపణలకు చరమగీతం పాడాలని నిర్ణయించుకుంది ఇండియన్ ఆర్మీ. ఈ క్రమంలో గతనెల 28వ తేదీ అర్ధరాత్రి తర్వాత నియంత్రణ రేఖ దాటి, పీవోకేలోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినప్పటి వీడియో క్లిప్పింగ్స్ లను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. కాగా, సైనిక చర్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా వాటిని కేంద్రానికి అప్పగించాలన్న నిబంధన కూడా ఉండటంతో ఈ విధి విధానాల ప్రకారం సర్జికల్ స్ట్రైక్ వీడియో క్లిప్పింగ్స్ ను సైన్యం - కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఇదే సమయంలో వాటిని బహిర్గతం చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వీటిని విడుదల చేయాలా వద్దా - చేస్తే ఎప్పుడు విడుదల చేయాలి అనేది పూర్తిగా ప్రధానమంత్రి కార్యాలయమే (పీఎంవో) నిర్ణయిస్తుంది.
కాగా, ఆర్మీ నుంచి వీడియో క్లిప్పింగ్స్ అందిన విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ ఇప్పటికే కంఫర్మ్ చేశారు. గతంలో ఇలాంటి అంశాలపై లిఖితపూర్వక నివేదికలు సమర్పించేవారని... ఇప్పుడు కాలం మారడంతో, వీడియో క్లిప్స్ ఇచ్చారని తెలిపారు. సైన్యం వీడియో క్లిప్స్ సమర్పించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజుజు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/