Begin typing your search above and press return to search.

వీటితోనే మనోళ్లు పాక్ తాట తీశారు

By:  Tupaki Desk   |   1 Oct 2016 5:40 AM GMT
వీటితోనే మనోళ్లు పాక్ తాట తీశారు
X
తరచూ కవ్వింపు చర్యలతో భారత్ ను చికాకు పెట్టే పాకిస్థాన్ కు భారత సైన్యం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేయటం తెలిసిందే. నియంత్రణ రేఖను దాటి మరీ ఉగ్రమూకలపై భారత సైనికులు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ సంచలనం సృష్టించటమే కాదు.. పాక్ ను పెను షాక్ కు గురి చేశాయి. భారత సైన్యం జరిపిన రహస్య ఆపరేషన్ లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు(40 వరకూ) హతమైనట్లుగా చెబుతున్నారు. లక్షిత దాడుల కోసం భారతసైనికులు వాడిన ఆయుధాలేంటి? వాటి ప్రభావం ఎంత? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతోంది. భారత సైన్యం వాడిన అత్యాధునిక ఆయుధాల్లో 500 మీటర్ల దూరంలోని బంకర్లను ధ్వంసం చేసే శక్తి ఉన్నఆయుధాల్ని లక్షిత దాడుల కోసం వినియోగించారు. మన సైన్యం వాడిన ఆయుధాల్లో కొన్నింటిని చూస్తే..

గోడల్ని తునాతునకల్ని చేసేస్తుంది..

ఆర్ వీవో ప్లేమ్ త్రోయర్ అని వ్యవహరించే ఆయుధంతో భారత్ సైన్యం ఉగ్రమూకలపై విరుచుకుపడింది. ఈ ఆర్ పీవో నుంచి 11 కిలోల బరువు ఉన్న 70 సెంటీమీటర్ల పొడవైన రాకెట్ సెకనుకు 130 మీటర్ల వేగంతో దూసుకెళ్లటమే కాదు.. వెయ్యి మీటర్లు లోపు ఉండే లక్ష్యాల్ని ఛేదించే సత్తా వాటి సొంతం. గోడల్ని సైతం తనాతునకలు చేసే ఈ ఆయుధం రాకెట్ లాంచర్ల మాదిరి పని చేస్తుంది.

నిమిషానికి ఆరు రౌండ్లు..

కార్ల్ గస్టఫ్రీకాయిల్ లెస్ రైఫిల్ 7 కిలోల నుంచి 14.2 కిలోల బరువున్న మందుగుళ్లను ప్రయోగించొచ్చు. సుమారు ఒక మీటరు పొడవు ఉండే వీటితో.. నిమిషంలో ఆరు రౌండ్ల వరకు కాల్చొచ్చు. దీంతో 700 మీటర్ల దూరంలో స్థిరంగా ఉండే లక్ష్యాన్ని.. 400 మీటర్ల దూరంలో కదులుతూ ఉన్న లక్ష్యాన్ని ఛేదించే వీలుంది.

భారీ నష్టాన్ని కలిగించే గ్రెనేడ్ లాంచర్

ఉగ్రవాదులు ఉన్న ప్రదేశాల్ని భారీ నష్టానికి గురి చేసేందుకు గ్రైనేడ్ లాంఛర్ ఉపయోగపడుతుంది. సైనికుడు భుజంపై ఉంచుకొని గ్రెనేడ్లు పేల్చే స్థాయినుంచి కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేసే లాంఛర్లు ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/