Begin typing your search above and press return to search.
సీఎం వర్సెస్ సైన్యం...మనదేశం పరిస్థితి
By: Tupaki Desk | 6 March 2018 5:48 AM GMTభారతదేశ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలు చాలవన్నట్లు మరో కొత్త సమస్య తెరమీదకు వచ్చింది. ఇప్పటికే ఆందోళనలు - కాల్పులతో అల్లకల్లోలం అయిపోతున్న జమ్ముకశ్మీర్ లో సీఎం వర్సెస్ సైన్యం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సైన్యం గళం విప్పడం ఆసక్తికరంగా మారింది. షోపియాన్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ విషయమై జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీకి - సైన్యానికి మధ్య మరోసారి వివాదం ఏర్పడింది. ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో పౌరులు ఉన్నారని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ వారు మిలిటెంట్లని - తమపై కాల్పులు జరుపడంతో ఆత్మరక్షణార్థం జరిపిన ఎదురు కాల్పుల్లో మరణించారని సైన్యం చెబుతున్నది. ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలకు సీఎం మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు.
షోపియాన్ జిల్లాలో వాహనాల తనిఖీ కేంద్రం వద్ద రెండుకార్లలో వెళ్తున్న ఉగ్రవాదులకు - భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగగా లష్కరే తాయిబా ఉగ్రవాది - ముగ్గురు మద్దతుదారులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపైనే వివాదం రేగింది. దీంతో ఇటు సీఎం అటు సైన్యం వివరణలు ఇచ్చింది. కాగా, ఆదివారం రెండు వాహనాల్లో పారిపోతున్న ఉగ్రవాదులపై పోలీసులు - సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. మృతులలో ఒకరిని రాక్ లష్కరే తాయిబా ఉగ్రవాది ఆశిక్ హుస్సేన్ భట్ గా గుర్తించామని పోలీస్ శాఖ ప్రతినిధి తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అందజేసినట్టు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా షోపియాన్‌లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
మరోవైపు జాయింట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ పిలుపు మేరకు సోమవారం బంద్ జరిగింది. దీంతో రెండు నెలల శీతాకాల సెలవుల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.