Begin typing your search above and press return to search.
మనోళ్లు దాయాది తాట తీశారంట
By: Tupaki Desk | 5 Nov 2016 8:18 AM GMTసర్జికల్ దాడులతో పాక్ పీచమణిచిన భారత్.. మరోసారి పాకిస్థాన్ కు ఊహించని షాక్ ఇచ్చిందా? అంటే అవునని చెబుతున్నారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన తాజా ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు విసుగెత్తిన భారత బలగాలు జూలు విదల్చటమే కాదు.. ఉగ్రస్వరూపాన్ని ప్రదర్శించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నియంత్రణ రేఖ వద్ద శతఘ్నులతో కాల్పులకు దిగి.. పాక్ కు చెందిన నాలుగు శిబిరాల్ని ధ్వంసం చేసిన విషయం బయట ప్రపంచానికి కాస్త ఆలస్యంగా తెలిసింది.
ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచ్చిల్ సెక్టార్ లో ఉగ్రవాదులు సరిహద్దు రేఖను దాటి వచ్చి భారత జవాను తల నరికిన వైనం సైన్యంలో ఆగ్రవేశాలకు కారణమైందని చెబుతున్నారు. ఉగ్రవాదులకు సహకరించిన పాక్ దళాలపై.. పెద్ద ఎత్తున దాడులు నిర్వహించటం ద్వారా భారత సైన్యాలు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అక్టోబరు 29న భారత సైన్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. కుప్వారా జిల్లాలోని కెరణ్ సెక్టార్ లోని పాక్ బలగాలపై విరుచుకుపడ్డాయి.
శతఘ్నులతో జరిపిన దాడుల్లో పాక్ కు చెందిన నాలుగు సైనిక శిబిరాలు.. ఒక పటాలం ప్రధాన కార్యాలయం నేలమట్టమయ్యాయి. దాదాపు పదమూడేళ్ల తర్వాత అంటే.. 2003లో ఇరుదేశాల కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసిన నాటి నుంచి నియంత్రణ రేఖ వద్ద శతఘ్నులతో దాడి చేయటం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. పాక్ దళాలకు ధీటైన జవాబు ఇచ్చే క్రమంలో నియంత్రణ రేఖ సమీపంలో శతఘ్నుల్ని మొహరించి..ఇటీవల వాటిని వినియోగించిన విషయాన్ని భారత సైనికాధికారులు అధికారికంగా ప్రకటించటం చూస్తే.. పాక్ తీరుతో వారెంతగా విసిగిపోయారో ఇట్టే అర్థమవుతుందని చెప్పొచ్చు.భారత సైన్యం మెరుపు వేగంతో జరిపిన భారీ దాడుల్లో పాక్ కు చెందిన కీలకమైన నాలుగు స్థావరాలు ధ్వంసం కావటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/