Begin typing your search above and press return to search.

దాయాది దాచాల‌న్నా దాగ‌ని నిజాలివే!

By:  Tupaki Desk   |   1 March 2019 5:29 AM GMT
దాయాది దాచాల‌న్నా దాగ‌ని నిజాలివే!
X
దుష్ట దుర్మార్గ దాయాది పాకిస్థాన్ అన్న మాట‌లు త‌ర‌చూ వింటుంటాం. మ‌న ప‌ని మ‌నం చేసుకుపోతున్నా ఓర్వ‌లేని పాక్ తీరుపై ప్ర‌తి భార‌తీయుడు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. వారి కోపంలో ధ‌ర్మం ఉంది. వారి మాట‌ల్లో న్యాయం క‌నిపిస్తూ ఉంటుంది. ఈ విష‌యం తాజా ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో మ‌రోసారి రుజువైంది. జ‌రిగిన ఘ‌ట‌న‌ల్ని జ‌రిగిన‌ట్లుగా ఒప్పుకోవ‌టంలోనూ పాక్ మొద‌ట్నించి తొండాట‌నే ఆడుతూ ఉంటుంది.

తాము ఇద్ద‌రు పైలెట్ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం కానీ.. తాము ఎఫ్ 16 విమానాల్ని వాడ‌లేద‌ని కానీ చెప్పినా అవ‌న్నీ అబ‌ద్ధాలే కానీ నిజాలు ఎంత‌మాత్రం కావు. ఇప్పుడు ఇవే విష‌యాన్ని ఆధారాల‌తో స‌హా భార‌త్ చూపిస్తోంది. భార‌త్ కు చెందిన మిగ్ 21 బైస‌న్ ను కూల్చేసిన విష‌యాన్ని ప్ర‌పంచానికి చెప్పేందుకు ప‌డిన ఆరాటం.. త‌న‌కు చెందిన ఎఫ్ 16ల‌ను భార‌త్ కూల్చినా కిమ్మ‌ని ప‌రిస్థితి.

ఎవ‌రి తీసుకున్న గోతిలో వారే ప‌డ‌తార‌న్న‌ట్లు..భార‌త్ కు చెందిన మిగ్ నుతాము కూల్చేసిన‌ట్లుగా చెప్పే క్ర‌మంలో అత్యుత్సాహంతో విడుద‌ల చేసిన పాక్ కు వారి దొంగ‌బుద్ధి ప్ర‌పంచానికి తెలిసేలా చేసింది. భార‌త్ కు చెందిన మిగ్ 21 బైస‌న్ శ‌క‌లాల ఫోటోల్ని విడుద‌ల చేసిన పాక్.. పొర‌పాటున త‌న‌కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని భార‌త్ కూల్చేయ‌టం.. ఆ శ‌క‌లాల‌తో క‌లిపి.. పాక్ కు చెందిన ఎఫ్ 16 శక‌లం ఫోటోను విడుద‌ల చేశారు

పాక్ కూల్చింది మిగ్ 21 అయితే.. ఎఫ్ 16 యుద్ధ విమాన శ‌క‌లం ఫోటో బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న‌కు పాక్ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. అంటే.. భార‌త్ మొద‌ట్నించి చెప్పిన‌ట్లే పాక్ కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసిన‌ట్లు చెప్పిన భార‌త వైమానిక ద‌ళ స‌భ్యుల మాట నిజ‌మేన‌ని తేలింది. అంతేకాదు.. తాను ప్ర‌యాణిస్తున్న మిగ్ కూలిపోవ‌టానికి కొద్ది క్ష‌ణాల ముందు వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ ఆర్ - 73 క్షిప‌ణిని ఎఫ్ 16పై సంధించి దాన్ని కూల్చేశారు. అయితే.. అదేమీ లేద‌ని పాక్ బుకాయిస్తే.. పాక్ విడుద‌ల చేసిన ఫోటోల్లో ఉన్న ఒక ఫోటో ఎఫ్ -16 తాలూకు ఇంజ‌న్ ద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తేలిపోవ‌టంతో దాయాది న‌వ్వుల పాలైంది.

అంతేకాదు.. పాక్ కు చెందిన ఎఫ్ - 16ను కూల్చేసిన ఉదంతంపై భార‌త్ స్పందిస్తూ కొన్ని ఆధారాల్ని బ‌య‌ట‌పెట్టింది. భార‌త్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించిన పాక్ విమానాలు ఏఐఎం120సీ - 5 ఆమ్ రామ్ ల‌ను ప్ర‌యోగించాయి. వీటిని బ‌య‌ట‌పెట్టిన భార‌త్‌.. ఇవి కేవ‌లం ఎఫ్ 16 ద్వారా మాత్ర‌మే ప్ర‌యోగిస్తార‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. దీంతో.. పాక్ అవున‌న్నా.. కాద‌న్నా.. తాను ఎఫ్ -16 యుద్ధ విమానాల్ని ప్ర‌యోగించాన‌న్న విష‌యంతో పాటు.. తాను అక్ర‌మంగా భార‌త గ‌గ‌న‌త‌లంలోకి వ‌చ్చాన‌న్న విష‌యాన్ని పాక్ త‌న‌కు తాను చెప్పుకున్న‌ట్లైంది. నిజాన్నిఎంత‌గా దాచాల‌నుకున్నా దాగ‌ద‌న్న విష‌యం దాయాదికి ఇప్ప‌టికైనా తెలిసి ఉంటుందంటారా