Begin typing your search above and press return to search.
భారత్ పై సైబర్ వార్ మొదలెట్టిన చైనా!
By: Tupaki Desk | 23 Jun 2020 10:50 AM GMTభారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ జరిగి ఇరు దేశాల సైనికులు మరణించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా చెడిపోయాయి. చైనా వస్తువుల నిషేధం దిశగా భారత్ అడుగులు వేస్తుండడం.. అమెరికా సహా అగ్రరాజ్యాల సపోర్టు భారత్ కు దక్కుతుండడంతో చైనా ఓర్చుకోలేకపోతోంది. అందుకే ప్రతీకారం దిశగా అడుగులు వేస్తోంది. సరిహద్దుల్లో తేల్చుకోవడంతోపాటు ఇప్పుడు సైబర్ వార్ ను కూడా మొదలుపెట్టింది.
ఇప్పటికే కరోనా వైరస్ ను అంటకట్టి ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసి చైనా తాజాగా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతోంది. అది విఫలం కావడంతో ఇక భారత్ పై సైబర్ వార్ కు రెడీ అయ్యింది.
గాల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత భారత సర్వర్లపై చైనా హ్యాకర్లు సైబర్ దాడులతో విరుచుకుపడుతున్నట్టు తెలిసింది. భద్రతా సంస్థలతో అనుబంధం ఉన్న డేటా సర్వర్లపై జూన్ 15 నుంచి నేటి వరకు చైనా హ్యాకర్లు 40వేలకు పైగా హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని భారత నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సైబర్ దాడులు చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచి జరుగుతున్నట్టు కనిపెట్టారు. ఎందుకంటే సిచువాన్ ప్రాంతంలో చైనా సైబర్ వార్ ఫేర్ ప్రధాన కార్యాలయం ఉంది. దీంతో ఈ దాడులు చైనా ప్రభుత్వమే చేయిస్తోందన్న అనుమానాలను భారతీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే భారత అధికారులు చైనా సైబర్ దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నారు. భారత సర్వర్లను హ్యాక్ చేసి ఇంటర్నెట్ ట్రాఫిక్ ను తమ నిఘా విభాగానికి మళ్లిస్తున్న చైనాకు చెక్ పెడుతున్నారు భారత సైబర్ నిపుణులు. సాఫ్ట్ వేర్ రంగంలో మెరుగైన భారత్ ముందు చైనా సైబర్ నిపుణుల పప్పులు ఉడకడం లేదని తెలుస్తోంది.