Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరి వల్లే..నీరవ్ దేశం దాటేసి హ్యాపీగా ఉన్నాడట
By: Tupaki Desk | 17 April 2018 4:20 AM GMTబ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) కుంభకోణాన్ని తవ్వినకొద్దీ అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ - ఆయన మామ మెహుల్ చోక్సీ ప్రమేయంతో జరిగిన ఈ భారీ కుంభకోణం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలోనే అతిపెద్ద మోసంగా ఘనతకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు రూ.14 వేల కోట్లు స్వాహా అయిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన కొద్దిరోజులకే దేశంలోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్ బీ)కి చెందిన ఇద్దరు అధికారులు చైనా నూతన సంవత్సరం (ఫిబ్రవరి 16-19) సందర్భంగా హాంకాంగ్ లో రహస్య పర్యటన జరిపారు. పాత తేదీలతో పత్రాలను రూపొందించి ఈ మోసాన్ని మాయం చేయాలన్న ప్రధాన లక్ష్యంతో వారు ఈ పర్యటన జరిపినట్లు స్పష్టమవుతోంది. నీరవ్ - చోక్సీ ఆధ్వర్యంలోని కంపెనీలు ముంబైలోని బ్రాడీ హౌస్ పీఎన్ బీ శాఖ నుంచి పొందిన వందలాది తప్పుడు అండర్ టేకింగ్ లెటర్లను (ఎల్ వోయూలను) ఆసరాగా చేసుకుని హాంకాంగ్ లోని భారతీయ బ్యాంకుల నుంచే అత్యధిక మొత్తంలో రుణాలను పొందడంపై దర్యాప్తు సంస్థలు దృష్టిసారించడంతో ఈ పర్యటన విషయం వెలుగులోకి వచ్చింది.
నీరవ్ - చోక్సీలకు రుణాలను ఇవ్వడంలో పలు బ్యాంకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విధానాలతో పాటు సాధారణ బ్యాంకింగ్ పద్ధతులను - మార్గదర్శకాలను సైతం తుంగలో తొక్కాయి. అండర్ టేకింగ్ లెటర్లను జారీ చేసిన పీఎన్ బీ శాఖను సంప్రదించి తనిఖీ (కౌంటర్ వెరిఫికేషన్) చేసుకోకుండానే ఆ బ్యాంకులు అనేక ఎల్ వోయూలతో నీరవ్ - చోక్సీ సంస్థలకు భారీగా రుణాలిచ్చాయి. కనుక ఈ నిర్ణయాల విషయమై ఆ బ్యాంకులను అనుమానించాల్సిందే. ఈ అనుమానాలపై ప్రశ్నించేందుకు త్వరలోనే ఆయా బ్యాంకుల అధికారులకు సమన్లు పంపుతాం అని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు ఆ ఇద్దరు అధికారులు ఈ పర్యటన సందర్భంగా నీరవ్ - చోక్సీ రుణాలకు సంబంధించిన పత్రాలను సవరించడంతో పాటు పేపర్-ట్రెయిల్స్ ను చెరిపివేసినట్లు అనుమానిస్తున్నారు. `హాంకాంగ్ లోని కొన్ని భారత బ్యాంకుల శాఖలు నీరవ్ - చోక్సీ జరిపిన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని అందజేయడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇందుకు హాంకాంగ్ లోని చట్టం - ప్రత్యేకించి అక్కడి పర్సనల్ డేటా ప్రైవసీ ఆర్డినెన్స్ (పీడీపీవో) ఒప్పుకోవని ఆ బ్యాంకులు బుకాయిస్తున్నాయి. అయితే ఈ వాదనలో నిజం లేదు. నీరవ్ - చోక్సీల లావాదేవీలను మోసపూరితమైనవిగా ప్రకటించి ఆ బ్యాంకులు ఈ సమాచారాన్ని అందజేయవచ్చు` అని భారత దర్యాప్తు వర్గాలు వివరించాయి. ఈ కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతున్నదని, నీరవ్ - చోక్సీల మోసానికి సంబంధించిన వివరాలను మరుగున పడేసేందుకు పీఎన్ బీ సహా పలు ఇతర బ్యాంకుల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయని దర్యాప్తు అధికారులు పేర్కొంటూ.. హాంకాంగ్ లోని భారత బ్యాంకుల అధికారులు - ఆడిటర్లు ఈ కుంభకోణాన్ని పసిగట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని స్పష్టం చేశారు.
హాంకాంగ్ లోని పలు భారతీయ బ్యాంకులు నీరవ్ - చోక్సీలకు రుణాలు ఇచ్చినప్పటికీ ఆర్థికంగా వాటికొచ్చిన నష్టమేమీ లేదు. ఈ రుణాలన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంకు మెడకు చుట్టుకోవడమే ఇందుకు కారణం. ఆ బ్యాంకుల నుంచి నీరవ్ - చోక్సీల కంపెనీలు పొందిన రుణాలను పీఎన్‌బీయే స్వయంగా తిరిగి చెల్లించడం మినహా మరో గత్యంతరం లేదు. అయితే ఈ కుంభకోణంతో హాంకాంగ్‌లోని భారత బ్యాంకుల పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి జారీ అయిన తప్పుడు ఎల్ వోయూలు - క్రెడిట్ లెటర్ల (ఎల్ సీల) ఆధారంగా నీరవ్ - చోక్సీలకు పెద్ద మొత్తాల్లో రుణాలిచ్చిన ఆ బ్యాంకులు ఈ ఎల్ వోయూలు - ఎల్ సీల విషయమై పీఎన్ బీని కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగకపోవడం అనేక సందేహాలను రేపుతోంది. ఈ కుంభకోణం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని, సదరు ఎల్‌వోయూలు, ఎల్‌సీల్లో కనీసం ఒక్కటి కూడా హాంకాంగ్‌లో పీఎన్‌బీ శాఖ దృష్టికి రాకపోవడమే ఇందుకు కారణమని ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి చెప్పారు.
సాధారణంగా వ్యాపార రుణాలిచ్చే ఏ బ్యాంకు అయినా సదరు ఎల్ వోయూలు లేదా ఎల్‌సీలను తమ సొంత శాఖకే పంపిస్తుందని, ఇటువంటి లెటర్లను నేరుగా అందుకున్న ఇతర బ్యాంకులు ఆయా లెటర్ల విషయమై హాంకాంగ్ లోని పీఎన్ బీ శాఖను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి భారత ప్రభుత్వ రంగంలోని ఇతర బ్యాంకులకు ఎల్ వోసీలు - ఎల్ సీలు వెళ్తున్నట్లు హాంకాంగ్‌లోని తమ శాఖ సిబ్బందికి తెలియదని, ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లయితే సదరు ఎల్ వోయూలు - ఎల్ సీలను నేరుగా తమ శాఖకే పంపాల్సిందిగా పీఎన్‌బీ ప్రధాన కార్యాలయాన్ని అడిగి ఉండేవారమని ఆ అధికారి తెలిపారు.