Begin typing your search above and press return to search.
ఇది సినిమా ఎంతమాత్రం కాదు.. రియల్ స్టోరీ!
By: Tupaki Desk | 18 Sep 2018 4:34 AM GMTనిజానికి ఇలాంటి సీన్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంటుంది. నిజానికి.. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇంత భారీ సీన్ లేదని చెప్పాలి. ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలో తప్పనిసరిగా వాడుకోవటానికి సూట్ అయ్యే ఈ సీన్ ఆద్యంతం ఆసక్తికరమే కాదు.. ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా? అనిపించక మానదు.
స్కాట్లాండ్ లోని సెయింట్ ఆండ్రూస్ పట్టణంలో ఒక పురాతనమైన భవంతి ఉంది. దాని విలువ జస్ట్ రూ.1885 కోట్లు మాత్రమే. దాన్నో భారతీయ బిలియనీర్ కొనేశాడు. ఇంతవరకూ ఓకే. ఇంతకీ ఆ పెద్దాయన వేల కోట్లు పెట్టి ఆ భవనాన్ని ఎందుకు కొన్నాడో తెలుసా? తన కుమార్తె చదువుకోవటానికి ఆ ఊరికి వస్తోంది. మరి.. ఆ ఊర్లో ఉండటానికి సరైన భవనం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసేశారు.
కొద్ది రోజుల్లో తన కుమార్తె పట్టణంలోని వర్సిటీలో కోర్సు చేయటానికి రాబోతోంది. ఇందుకు ముందుగానే ఏర్పాట్లు చేసేందుకు ఆయన నడుం బిగించారు. ప్రస్తుతం ఆ భవనాన్ని కొనుగోలు చేసిన భారతీయ బిలియనీర్ ఎవరన్న విషయాన్ని రహస్యంగా దాచారు. ఇంతకీ ఆ భవనం పేరు ఏమంటారా? ఈడెన్ మేన్షన్. విక్టోరియా కాలానికి చెందిన ఈ రాజసౌథాన్ని 1860లో నిర్మించారు.
మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన ఫీల్డ్ మార్షల్ ఎర్ల్ హేగ్ కుటుంబానికి ఈ భవనంలో వేసవి విడిదిగా ఉండేది. స్కాట్లాండ్లో ఖరీదైన విస్కీ డిస్టలరీ ఆయనకు ఉండేది. ఆయన మరణించిన తర్వాత ఆ కుటుంబం ఈ రాజసౌథాన్ని అమ్మేసింది.
ఐదు ఎకరాల స్థలంలో చోట.. భారీ భవంతి ఉండే ఈ రాజప్రసాదంలో ఎనిమిది అత్యంత విశాలమైన బెడ్రూంలు.. చిన్నసినిమా హాలు.. వైన్ సెల్లార్ తో పాటు..పెద్ద ఎత్తున వసతులు ఉన్నాయని చెబుతారు. 2003లో బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్.. అతని గర్ల్ ఫ్రెండ్ కేట్ మిడిల్ టన్ ఈ భవనాన్ని కొనుగోలు చేయాలని మనసు పడ్డారు కానీ తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ భవనంలో ఉండబోయే తన కుమార్తెకు సేవలు చేయటం కోసం 12 మంది సిబ్బంది అవసరం అంటూ ఒక ప్రకటనను విడుదల చేశాడా భారతీయ బిలియనీర్. ఆ ప్రకటనలో.. వంటవాడు తప్పనిసరిగా దక్షిణాది వంటకాలు.. ముఖ్యంగా దోశె వేయటం వచ్చి ఉండాలన్న షరతు విధించటం చూస్తుంటే.. సదరు వ్యాపారవేత్త దక్షిణ భారతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. కూతురు చదువుకోవటానికి వెళుతున్న ఊళ్లో.. ఆమె ఉండటం కోసం ఏకంగా 1900 కోట్లు ఖర్చు చేస్తున్న పారిశ్రామికవేత్త ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.