Begin typing your search above and press return to search.
మనోళ్ల బ్లాక్ మనీ అడ్డా స్విస్ బ్యాంకు కాదట
By: Tupaki Desk | 3 July 2017 7:15 AM GMTనల్ల కుబేరులకు స్వర్గధామంగా భావిస్తున్న స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బు నిల్వలు తరిగిపోతున్నాయి. స్విట్జర్లాండ్ జాతీయ బ్యాంక్ (ఎస్ ఎన్బీ) తెలిపిన వివరాల ప్రకారం 2016లో నల్లధనం దాచుకున్నవారున్న దేశాల్లో భారత్ 88వ స్థానానికి పడిపోయింది. మూడేళ్లుగా వరుసగా భారతీయుల నగదు నిల్వలు రికార్డు స్థాయిలో తరిగిపోయి 676 మిలియన్ల స్విస్ ఫ్రాంక్ ల (రూ.4,500 కోట్లు)కు చేరుకున్నాయి. 2015లో 0.08 శాతంగా ఉన్న భారతీయుల డబ్బు.. గతేడాది 0.04 శాతానికి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో భారతీయులు తమ అక్రమ సంపాదనను స్విస్ బ్యాంకుల నుంచి ఇతర దేశాల బ్యాంకులకు మళ్లించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయులు కొద్ది మొత్తంలో డిపాజిట్ చేశారని స్విస్ బ్యాంకులు చెబుతున్నాయి. కానీ ఆర్థిక కేంద్రాలుగా ఉన్న సింగపూర్ - హాంకాంగ్ బ్యాంకుల్లో భారతీయుల నిల్వలు పెరిగాయని అధికార వర్గాల కథనం. అయితే అధికారికంగా స్విట్జర్లాండ్ జాతీయ బ్యాంక్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు మొత్తం 389 బిలియన్ల ఫ్రాంక్ లు జమచేశారు. ఇందులో 25 శాతం (359 బిలియన్ల ఫ్రాంక్‌లు)తో బ్రిటన్ తొలిస్థానంలో, 14 శాతంతో (177 బిలియన్ల ఫ్రాంక్ లు) అమెరికా రెండో స్థానంలో నిలిచాయి. అత్యధిక నల్లధనం జమచేసినవారున్న మొదటి పది దేశాల్లో వెస్టిండీస్ - ఫ్రాన్స్ - బహమాస్ - జర్మనీ, జెర్సీ, హాంకాంగ్ - లక్సెంబర్గ్ నిలిచాయి. 2004 నాటికి స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు నల్లధనం జమచేసిన జాబితాలో భారత్ 37వ స్థానంలో నిలిచింది. క్రమంగా నాటి నుంచి ఏటేటా స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం నిల్వలు తరుగుతూ వచ్చాయి. 2007 వరకు టాప్ 50 దేశాల జాబితాలో ఉన్న భారత్.. 2008 నుంచి క్రమంగా 55వ స్థానానికి.. అక్కడ నుంచి 2009తో 2014లో చివరికల్లా 61, 2015 నాటికి 75వ స్థానానికి పడిపోయింది. 1996 2007 మధ్య టాప్ 50లో కొనసాగిన భారతీయుల డిపాజిట్లు 2009 - 2010లలో 59వ స్థానానికి పడిపోయాయి. 2011లో 55వ స్థానానికి పెరిగిన నల్లకుబేరుల నిల్వలు తిరిగి 2013లో 58, 2012లో 71వ స్థానానికి పడిపోయాయి. 2016 చివరికల్లా స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచుకున్న నల్లధనం మొత్తం 141 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌ల నుంచి స్వల్పంగా 142 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంక్‌లకు పెరిగింది. పాకిస్థాన్ 2015లో 71వ స్థానంలో కొనసాగుతోంది.
స్విస్ ఖాతాలు గల బ్రిక్స్ దేశాల జాబితాలోనూ భారత్ దిగువనే కొనసాగుతోంది. 15.6 బిలియన్ల ఫ్రాంక్‌లతో రష్యా 19వ స్థానం, 9.6 బిలియన్ల ఫ్రాంక్‌లతో చైనా 25, 2.7 బిలియన్లతో బ్రెజిల్ 52, 2.2 బిలియన్ల ఫ్రాంక్‌లతో దక్షిణాఫ్రికా 61 స్థానం కలిగి ఉన్నాయి. భారత్ పొరుగుదేశాల్లో బంగ్లాదేశ్ 667.5 మిలియన్ల ఫ్రాంక్‌లతో 89వ స్థానం, నేపాల్ 312 మిలియన్ల ఫ్రాంక్‌లతో 150, 307 మిలియన్ ఫ్రాంక్ లతో శ్రీలంక 151, 50 లక్షల ఫ్రాంక్‌లతో భూటాన్ 282వ స్థానం పొందాయి. స్విస్ బ్యాంకుల్లో సంపన్న దేశాల పౌరులు దాచుకున్న మొత్తం 824 బిలియన్ల ఫ్రాంక్‌లు కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాల పౌరులు కేవలం 208 మిలియన్ల ఫ్రాంక్ లు జమచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/