Begin typing your search above and press return to search.

ఐసీసీ.. ఐపీఎల్ ను ఫాలో అయితే బెటర్

By:  Tupaki Desk   |   22 July 2019 10:44 AM GMT
ఐసీసీ.. ఐపీఎల్ ను ఫాలో అయితే బెటర్
X
ప్రపంచకప్ విజేతగా ఇంగ్లండ్ గెలిచింది.కానీ ఓడిన న్యూజిలాండ్ కు ఆ క్రెడిట్ దక్కింది. ఇంగ్లండ్ విజయాన్ని ఎవ్వరూ గర్వంగా ఒప్పుకోని విధంగా గెలిచింది మరి. వన్డే మ్యాచ్ టై అయ్యి.. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై కావడంతో అత్యధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ ను విజేతగా నిలిపారు. ఐసీసీ పెట్టిన ఈ విధానం విమర్శలపాలైంది.

సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ లాంటి దిగ్గజ క్రికెటర్లు సైతం ఈ నిబంధనను తప్పుపట్టారు. అత్యధిక బౌండరీల ఆధారంగా కాకుండా మరో సూపర్ ఓవర్ పెట్టి ఉంటే బాగుండేదని సచిన్ పేర్కొన్నారు. చాలా మంది క్రికెట్ దిగ్గజాలు కూడా ఇదే మాటన్నారు.

తాజాగా భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా ఈ వివాదంపై స్పందించాడు. సూపర్ ఓవర్ టైగా ముగిస్తే.. మరొక సూపర్ ఓవర్ వేయిస్తే బాగుండు. బౌండరీల ఆధారంగా గెలిచిన జట్టును విజేతగా నిర్ణయించడం తప్పు.. ఇంకా చాలా పద్ధతులున్నాయి.. ఐసీసీ నిబంధనలు మార్చాలి అంటూ భరత్ అరుణ్ డిమాండ్ చేశారు.

ఇక అగ్రస్థానంలో నిలిచి ఓడిన జట్లకు మరో చాన్స్ కూడా ఇస్తే బాగుంటుందని భరత్ అరుణ్ పేర్కొన్నారు. ఐపీఎల్ లో టాప్ 1,2కు చేర ఓడిన జట్లకు మరో అవకాశం ఇస్తారని.. ఐసీసీ లాంటి ఈవెంట్లలో కూడా ఈ పద్ధతి ప్రవేశపెట్టాలని భరత్ అరుణ్ కోరారు. ఇండియా గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచినా సెమీస్ లో ఓడి ఇంటి దారిపట్టిందని.. ఐసీసీ కూడా ఐపీఎల్ నిబంధనల వలే మారిస్తే భారత్ ఇప్పుడు మరో స్థితిలో ఉండేదని అరుణ్ చెప్పుకొచ్చాడు. .