Begin typing your search above and press return to search.
కోట్లు చెల్లించి చార్టెడ్ ఫ్లైట్లో అమెరికాకు.. అందుకే వెళ్తున్నారా?
By: Tupaki Desk | 1 May 2020 5:30 PM GMTలాక్ డౌన్ కారణంగా అమెరికాలో పనిచేసే భారతీయుల్లో చాలా మంది స్వదేశంలో చిక్కుకున్నారు. విమానాలు రద్దు కావడంతో అక్కడికి వెళ్లలేకపోతున్నారు. బిజినెస్ లు లేకపోవడంతో ఇన్నాళ్లు వాళ్లు ఇక్కడే ఉన్నారు. ఇందులో హెచ్1బీ ఉద్యోగులు.. అమెరికాలో సెటిలైన బడా ఎన్నారైలు.. అమెరికాలో బిజినెస్ లు నిర్వహిస్తున్న భారతీయులు ఉన్నారు. వారంతా ఇప్పుడు అమెరికాకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
ముఖ్యంగా వీరిలో అమెరికాలో బిజినెస్ లు నిర్వహిస్తున్న ప్రవాస భారతీయ బిజినెస్ మెన్ లు చార్టెడ్ ఫ్లైట్స్ బుక్ చేసుకొని వెళ్లడానికి కూడా వెనుకాడడం లేదు. హెచ్1బీ సహా ఉద్యోగుల జీతం మహా అయితే 5వేల డాలర్లు.. వారు చార్టెడ్ ఫ్లైట్స్ లో వెళ్లే తాహతలేదు. ప్రత్యేక విమానం కోసం 9 లక్షల డాలర్లు ఖర్చు చేయాలి.. అంటే మన రూపాయల్లో అక్షరాల 6.75 కోట్లు. అమెరికాలో ఉద్యోగాలు చేసే వారు ఎవరూ ఉద్యోగాలు కాపాడుకోవడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే సాహసం చేయరు. చేయడం లేదు కూడా..
అమెరికాలో బిజినెస్ లు చేసేవారు మాత్రమే ఇప్పుడు ఇలాంటి స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసుకుని వెళ్లే సాహసం చేస్తున్నారు. వారి సంపాదన కోట్లలో ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నారు.
ఇక మరికొంత మంది హెచ్1 బీ ఉద్యోగులు కూడా కొంత మంది కలిసి ఓ స్పెషల్ ఫ్లైట్స్ అంతా బుక్ చేసుకొని వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట.. నాన్ అమెరికన్స్ కావడంతో ఈ ఉద్యోగులను అమెరికా తీసుకెళ్లడానికి అక్కడి ప్రభుత్వం విమానాలు సమకూర్చలేదు. అయితే ఉద్యోగాలు పోతాయని భయంతో చాలా మంది ఎలాగైనా పోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక చార్టెడ్ ఫ్లైట్స్ లో అయితే అమెరికాలో బిజినెస్ లు ఉన్న మన భారతీయులు మాత్రమే బుక్ చేసుకొని వెళుతున్నారట.. ఇప్పుడు ఇండియాలో ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడినట్టు తెలిసింది.