Begin typing your search above and press return to search.
కోహ్లీ గ్రేట్.. ఈ ఒక్క వీడియో చాలు..
By: Tupaki Desk | 10 Jun 2019 6:29 AM GMTటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పెద్ద మనసును చాటాడు. పగోడు అయినా ఇదివరకు తప్పు చేసినా.. అతడి గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటాడు. భారత కెప్టెన్ కోహ్లీ చేసిన ఈ పనికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కడం విశేషం. ఇప్పుడు కోహ్లీ చేసిన పని ప్రస్తుతం వైరల్ గా మారింది.
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంవత్సరకాలం సస్పెన్షన్ కు గురయ్యాడు. ఐపీఎల్ తోనే మళ్లీ సంవత్సరం తర్వాత క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు. అతడికి అసీస్ ఈ ప్రపంచకప్ లో చోటిచ్చింది. అయితే ఇండియాతో మ్యాచ్ సందర్భంగా స్మిత్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. భారత అభిమానులు అతడిని అవమానించారు. స్మిత్ ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్.. చీటర్’ అంటూ గేలిచేశారు.
ఈ అరుపులును విన్న కెప్టెన్ కోహ్లీ.. హార్దిక్ ఔటైన సమయంలో ప్రేక్షకుల వద్దకు వెళుతూ.. అలా ప్రవర్తించవద్దంటూ. హెచ్చరించాడు. స్మిత్ పట్టుదలను ప్రోత్సహించాలని.. అతడికి చప్పట్లతో స్వాగతం పలకాలని భారత అభిమానులకు సూచిస్తూ సైగ చేశాడు. ఇలా వివాదాలతో జట్టుకు దూరమై అవమానాలతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన స్మిత్ ను భారత ప్రేక్షకులు అవమానించినా.. భారత కెప్టెన్ మాత్రం తన క్రీడాస్ఫూర్తిని చాటి మానవత్వం చాటారు.
ఇప్పుడు కోహ్లీ చేసిన పనిని ఐసీసీ కూడా ప్రశంసిస్తూ ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. స్మిత్ ను పొగడాలని చెప్పిన కోహ్లీకి ఆ తర్వాత స్మిత్ వచ్చి ధన్యవాదాలు తెలిపాడు. ఇలా కోహ్లీ బయటే కాదు.. మైదానంలోనూ గ్రేట్ మ్యాన్ అని అనిపించుకున్నాడు..