Begin typing your search above and press return to search.
అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు?
By: Tupaki Desk | 1 Sep 2018 1:44 PM GMTఅమెరికాలో ఉద్యోగం చేయాలని...అక్కడ సెటిల్ అయి తమ కలలను నిజం చేసుకోవాలని ప్రతి ఏటా వేలాదిమంది ఆకాంక్షిస్తుంటారు. ఆ కలను అందుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అమెరికన్ హెచ్ 1-బీ వీసాలకు దరఖాస్తు చేసుకుంటుంటారు. అటువంటి ఆశావహుల కలలను అవకాశంగా చేసుకున్న కొన్ని కంపెనీలు - కొంతమంది సీఈవోలు తప్పుడు ధ్రువ పత్రాలతో వీసాలు మంజూరు చేస్తుంటారు. ఆ కంపెనీలు చేసిన మోసానికి అన్యంపుణ్యం ఎరుగని అమాయకులు బలవుతుంటారు. అమెరికాలో ఇటువంటి వీసాల మోసాలకు పాల్పడుతున్న భారతీయుడికి అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. హెచ్1-బీ వీసా - గ్రీన్ కార్డుల దరఖాస్తుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఒక కంపెనీ సీఈవోను అమెరికా ప్రభుత్వం కటకటాల వెనుకకు నెట్టింది.
అమెరికాలో అజీమెట్రీ - డివెన్సి అనే రెండు ఐటీ కంపెనీలకు సీఈవోగా భారత్ కు చెందిన ప్రద్యుమ్న కుమార్ సామల్ (49) వ్యవహరిస్తున్నాడు. అయితే, అతడు తన కంపెనీలో పనిచేసేందుకు గానూ ఉద్యోగుల కోసం తప్పుడు - మోసపూరిత పత్రాలతో దాదాపు 200 హెచ్1 బీ వీసాలను పొందాడు. ఈ ఆరోపణలతో కుమార్ పై 2018 - ఏప్రిల్ లో వీసా ఫ్రాడ్ కేసు నమోదైంది. అయితే, ఆ కేసు విచారణ జరుగుతుండగా కుమార్ సామల్ పారిపోయాడు. దీంతో, అతడికోసం వెతుకులాట ప్రారంభించారు. తాజాగా, నేడు ఇండియానుంచి తిరిగి అమెరికా వస్తుండగా సియాటెల్ విమానాశ్రయం వద్ద కుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 2010, 2011 సంవత్సరాల్లో వాషింగ్టన్ లో హెచ్1-బీ వీసా, గ్రీన్ కార్డుల పేరు చెప్పి ప్రభుత్వాన్ని మోసం చేశాడని పోలీసులు తెలిపారు. బెంచ్-అండ్-స్విచ్ స్కీం కింద కస్టమర్ల నుంచి, ఉద్యోగుల నుంచి డబ్బును నేరుగా తన ఖాతాలోకి మళ్లించాడని ఆరోపించారు. ఈ కేసులో కుమార్ కు 10 సంవత్సరాల జైలుతో పాటు, 250,000 డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉంది.