Begin typing your search above and press return to search.
మన సైనికులపై రాళ్లు విసిరి రెచ్చ గొట్టిన చైనా
By: Tupaki Desk | 20 Aug 2017 5:56 AM GMTఒకవైపు సిక్కింలోని డోక్లామ్ ప్రాంతంలో భారత్ - చైనా సైన్యాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలోనే మరోవైపు చైనా సైనికులు తమ మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. లడఖ్ లో భారత సైన్యాన్ని రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించారు. ఈ నెల 15న లడఖ్ లోని పాంగాంగ్ లో భారత - చైనా సైనికులు పరస్పరం తలపడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకింత ఆలస్యంగా శనివారం మీడియాకు వెల్లడయ్యింది.
ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకొంటున్న సమయంలో.. చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నించటంతో ఈ ఘర్షణ తలెత్తింది. ఘర్షణ జరిగిన సమయంలో ఇరువైపులా దాదాపు 60 మంది జవాన్ల చొప్పున ఉన్నారని సమాచారం. దాదాపు రెండు గంటల తర్వాత సద్దుమణిగింది. కాగా, భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇరు వర్గాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనని, దీనివల్ల శాంతికి విఘాతం కలుగుతుందని వివరించారు. చైనా సైనికులు రాళ్లతో భారత సైనికులపై దాడిచేస్తున్న విషయం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇది రెండు దేశాల ప్రయోజనాలకు మంచివి కావని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం చర్చలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
ఆర్మీ ఛీఫ్ బిపిన్ రావత్ ఆదివారం నుంచి మూడురోజుల పాటు లడఖ్ లో పర్యటించనున్నారు. డోక్లాంలో ప్రతిష్టంభన - తాజాగా పాగోంగ్ ఉద్రిక్తతల నేపథ్యంలో రావత్ లడఖ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు లడఖ్ లో రక్షణ పరమైన అంశాలపై సమీక్షించి చైనా సరిహద్దు వెంబడి భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించనున్నారు. అనంతరం ఉన్నతస్థాయి కమాండర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. చైనాతో ఉన్న సరిహద్దులో భద్రతా బలగాల సంసిద్ధతను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో కీలక విషయాలపై చర్చించనున్నారు. ఇక పోగాంగ్ సరస్సు 135 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా ఈ సరస్సులో మూడోవంతు భారత్ ఆధీనంలో ఉండగా మిగిలినది చైనా ఆధ్వర్యంలో ఉంది.