Begin typing your search above and press return to search.
అమెరికా గ్రీన్ కార్డ్ కోసం క్యూలో భారత కుబేరులు
By: Tupaki Desk | 21 Sep 2022 2:30 PM GMTఅగ్రరాజ్యం అమెరికాకు వెళ్లాలన్నది అందరి ఆశ. ఆ డాలర్ల వేటలో పడి సంపాదించుకోవాలని.. బాగుపడాలన్నది అందరి కోరిక. మనకే కాదు.. సంపన్నులు కూడా అమెరికాలో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సంపన్న విదేశీ పెట్టుబడిదారులు శాశ్వతంగా అమెరికాలో నివాసం ఉండడానికి వీలుగా అక్కడి ప్రభుత్వం వీసా ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది.
దీనికి భారతదేశం మరియు చైనా నుండి సంపన్నులు పోటీపడుతున్నారు. వీరు అమెరికాలో సెటిల్ అయిపోవాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తుదారుల క్యూ బాగా ఉందని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది చెబుతున్నారు.
'గోల్డెన్ వీసా' అని కూడా పిలువబడే ఈబీ-5 వీసాను అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టి అమెరికాలో కనీసం 10 శాశ్వత ఉద్యోగాలను సృష్టించే వారికి గ్రీన్ కార్డ్ లాగా అందజేస్తారు.
1990లో ప్రారంభమైన పెట్టుబడిదారుల ఈ కార్యక్రమాన్ని అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఈ చట్టాన్ని అనుసరించి దాదాపు ఒక సంవత్సరం పాటు హోల్డ్‌లో ఉన్న తర్వాత ఈ సంవత్సరం మార్చిలో సవరించబడింది.
ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ కన్సల్టెంట్ హెన్లీ & పార్ట్‌నర్స్ అంచనాల ప్రకారం.. దాదాపు 10,000 మంది అధిక-నికర-విలువ గల చైనీస్ సంపన్నులు, 8,000 మంది సంపన్న భారతీయులు ఈబీ-5 వీసా ప్రోగ్రామ్ ద్వారా వారి దేశాలను విడిచిపెట్టి అమెరికాలో సెటిల్ కావాలని చూస్తున్నారు.
నివేదిక ప్రకారం.. 2008 నుండి గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ లో భాగంగా భారతీయ, చైనా సంపన్నులు జెర్సీ సిటీలోని ట్రంప్ బే స్ట్రీట్, న్యూయార్క్ హడ్సన్ యార్డ్స్‌తో సహా ప్రాజెక్ట్‌ల కోసం $37 బిలియన్ల విదేశీ పెట్టుబడులను పెట్టారు. ఇప్పుడు వీరంతా వీసాలు అందుకోవడానికి రెడీ అయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.