Begin typing your search above and press return to search.
టీమిండియా క్రికెటర్లను చంపేస్తానంటూ హెచ్చరించాడు!
By: Tupaki Desk | 22 Aug 2019 11:39 AM GMTటీమిండియా క్రికెటర్లు అంటే ఇండియాలో ఉండే క్రేజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లను ఆల్మోస్ట్ దేవుళ్లుగా చూసే దేశం మనది. మన ఆటగాళ్లకు శత్రుదేశాల్లో కూడా గొప్ప ఆదరణ ఉంటుంది. సచిన్ - ధోనీ - కొహ్లీలకు పాకిస్తాన్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతా గమనిస్తూనే ఉంటారు.
మరి అలాంటి క్రికెటర్లను చంపేస్తానంటూ ఒక ఆకతాయి హెచ్చరిక జారీ చేశాడు. ఏకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కే అతడు మెయిల్ పెట్టాడు. భారత క్రికెటర్లందరినీ చంపేస్తానంటూ అతడు ఆ మెయిల్ లో పేర్కొన్నాడు. తమ అధికారిక మెయిల్ కు అలాంటి హెచ్చరిక రావడంతో బీసీసీఐ అధికారులు వెంటనే పోలిసులకు ఫిర్యాదు చేశారు.
ఆ వ్యహారాన్ని యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ కు సైతం అప్పగించేశారు. దీంతో వాళ్లు ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందో తేల్చారు. అందుకు సంబంధించి అస్సామ్ కు చెందిన బరజా మోహన్ దాస్ అనే వాడిని అదుపులోకి తీసుకున్నాడు. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లను చంపుతానంటూ మెయిల్ పెట్టింది వాడేనని నిర్ధారించాడు.
ఇంతకీ ఆ మెయిల్ ఎందుకు పెట్టాడు? అతడి వెనుక కథేంటి? అనే విషయాలను ఏటీఎస్ అధికారులు ఆరా తీస్తున్నారు. భారత జట్టు ఆటగాళ్లను చంపుతానన్న అతడి కథేంటో వారు తేలుస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.