Begin typing your search above and press return to search.
ప్రపంచ రికార్డు బద్ధలు.. టీ20 క్రికెట్లో డబుల్ సెంచరీ!
By: Tupaki Desk | 5 July 2021 5:30 PM GMTటీ20 క్రికెట్ అంటేనే.. ధనాధన్ ఫటాఫట్ గేమ్. వచ్చిన బంతినల్లా బౌండరీకి తరలించాలని బ్యాట్స్ మెన్.. ఆ ఒత్తిడిలోనే వికెట్ పడగొట్టాలని బౌలర్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. హిట్టింగే ప్రామాణికం అయిన ఈ గేమ్ లో ఏ బ్యాట్స్ మెన్ ఎప్పుడు వెనుదిరుగుతాడో తెలియదు. వన్డేలోనైనా మెల్లగా ఆడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అంచనాకు రావొచ్చు.. కానీ టీ20లో అదేం కుదరదు.
అయితే.. కేవలం 126 బంతుల్లో ముగిసే ఇన్నింగ్స్ లో జట్టు స్కోరు 200 మార్కు దాటడం అనేదే చాలా సార్లు అసాధ్యంగా మారుతుంది. అలాంటిది.. ఓ బ్యాట్స్ మెన్ ఈ స్కోరు బాదేశాడు. ఆ విధంగా.. టీ20 ఫార్మాట్ చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీ నమోదైంది.
అయితే.. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు. ఢిల్లీలో జరిగిరన ఓ క్లబ్ మ్యాచ్. ఢిల్లీ ఎలెవన్, సింబా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు సుబోధ్ భాటియా. ఢిల్లీ ఎలెవన్ జట్టుకు చెందిన ఈ ఆటగాడు ఓపెనర్ గా వచ్చి డబుల్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. కేవలం 79 బంతుల్లోనే 205 పరుగులు సాధించాడంటే.. ఎంతటి విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు.
సుబోధ్ అన్నింగ్స్ లో 17 ఫోర్లు, 17 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ రంజీ ఆటగాడు తొలి సెంచరీని కేవలం 17 బంతుల్లోనే సాధించడం విశేషం.. సుబోధ్ ఊచకోతతో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 256 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఈ స్థాయిలో వీరవిహారం చేసిన సుబోధ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.