Begin typing your search above and press return to search.
క్రికెటర్ రెస్టారెంట్లోనూ అదే ఛండాలమా?
By: Tupaki Desk | 7 Oct 2017 11:42 AM GMTడబ్బులు పోసి కొనుగోలు చేసే వస్తుల్ని నాణ్యతతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఓనర్ల మీద ఉంటుంది. సదరు యజమానులు సామాన్యులైతే లాభం కక్కుర్తితో కొన్ని దరిద్రాలకు పాల్పడుతుండటం కనిపిస్తుంది. నాణ్యతను వదిలేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. అధికారుల తనిఖీల్లో అడ్డంగా బుక్ కావటం కనిపిస్తుంది.
ఈ తరహా ఉదంతాలు హైదరాబాద్ లో చాలానే రెస్టారెంట్లలో చోటు చేసుకోవటం తెలిసిందే. కొన్ని ప్రముఖ రెస్టారెంట్లలోనూ కుళ్లిపోయిన మాంసాన్ని వండి పెట్టటం కనిపిస్తుంది. ఇలాంటప్పుడే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పేరు ప్రఖ్యాతులకు లోటు లేని వారు కూడా లాభం కోసం మరీ ఇంత దారుణంగా వ్యవహరించాలా? అన్న క్వశ్చన్ వస్తుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సెలబ్రిటీలు నిర్వహించే హోటళ్లలోనూ నాణ్యతను నీళ్లకు వదిలేసిన వైనం బయటకు రావటం షాకింగ్ గా మారింది. టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా తన సిస్టర్ తో కలిసి జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్ పేరిట ఒక రెస్టారెంట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోఉండే ఈ రెస్టారెంట్‌ను అక్కడి హెల్త్ విభాగపు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అవాక్కు అయ్యే విషయాల్ని గుర్తించారు.
ఫ్రిజ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉంచి పదార్థాలతో పాటు.. బేకరీ ఉత్పత్తులలో ఫంగస్ ఉండటాన్ని గుర్తించారు. అంతేనా.. మోతాదుకు మించిన ఫుడ్ కలర్స్‌ను వాడటాన్ని.. ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అజినోమోటోను వినియోగిస్తున్న వైనాన్ని గుర్తించారు.
2012లో క్రికెట్ థీమ్ తో జడేజా ఆయన సిస్టర్ ఈ రెస్టారెంట్ ను స్టార్ట్ చేశారు. ఇందులో మెక్సికన్.. చైనీస్.. థాయ్ ఫుడ్ దొరుకుతుందని చెప్పారు. ప్రముఖ క్రికెటర్ ఫ్యామిలీ రెస్టారెంట్ స్టార్ట్ చేశారంటూ అంచనాలు భారీగా ఉంటాయి. కానీ.. అందుకు భిన్నంగా నాణ్యత విషయంలో లోపాలు ఉన్నట్లుగా వెల్లడి కావటం సంచలనమైంది.
ఆ మధ్య వార్తల్లోకి ఎక్కిన రెస్టారెంట్ గురించి విని పలువురు షాక్ తిన్నారు. తాజాగా మరోసారి తన తీరును మార్చుకోలేదన్న విషయం మరోసారి రుజువైంది. ఈ రెస్టారెంట్‌లో అమ్మే ఆహార ఉత్పత్తులకు ఎక్సైపైరీ డేట్ లేకపోవటం.. పాడైపోయిన కూరగాయాల్ని వంటల కోసం వినియోగిస్తున్న వైనాన్ని గుర్తించారు.