Begin typing your search above and press return to search.

కెనడా సుప్రీంకోర్ట్ జడ్జీగా భారత సంతతి వ్యక్తి .. ఎవరంటే ?

By:  Tupaki Desk   |   18 Jun 2021 2:17 PM GMT
కెనడా సుప్రీంకోర్ట్  జడ్జీగా భారత సంతతి వ్యక్తి .. ఎవరంటే ?
X
ఉద్యోగం , వృత్తి , వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ప్రస్తుతం ఆయా దేశాల్లో అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ, వాణిజ్య, ఆర్ధిక తదితర రంగాల్లో భారత సంతతి వ్యక్తులు దూసుకెళ్తున్నారు. అమెరికా, బ్రిటన్‌‌ల తర్వాత భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన కెనడాలోనూ మనవాళ్లు కీలక పదవుల్లో వున్నారు .తాజాగా ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ భారత సంతతి న్యాయమూర్తి మహమ్మద్ జమాల్‌ను కెనడా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా నామినేట్ చేశారు ప్రధాన్ జస్టిన్ ట్రూడో.

కెనడా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా కెనడీయన్లను కాకుండా మరో వర్ణానికి చెందిన వ్యక్తిని ఆ పదవికి నామినేట్ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 146 ఏళ్లుగా సుప్రీంకోర్టు జ‌డ్జిలుగా తెల్ల‌జాతీయులు మాత్ర‌మే ఉంటున్నారు. కానీ తొలిసారి ఆ సంప్రదానికి ప్రధాని జస్టిన్ ట్రూడో కొత్త అధ్యాయానికి నాందిపలికారు. సుప్రీంకోర్టు జ‌డ్జిగా నామినేట్ అయిన మ‌హ‌మూద్ జ‌మాల్‌కు భార‌త్‌లోని గుజ‌రాత్ మూలాలు కలిగి ఉండటం విశేషం. 2019 మహమూద్ జమాల్ ఒంటారియో కోర్టు ఆఫ్ అప్పీల్ జ‌డ్జిగా జ‌మాల్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో జమాల్ సుప్రీంకోర్టులో జరిగిన 35 కేసుల విచారణలో హాజరయ్యారు. ఈ క్రమంలో జమాల్ ను ప్రధాని సుప్రీంకోర్టుకు జడ్జిగా నామినేట్ చేసి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ట్రుడో ట్వీట్ చేశారు.

''కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో ఇదో చారిత్రాత్మ‌క ఘ‌ట్టం'' అని జ‌మాల్ నామినేష‌న్‌ను ఉద్దేశించి ధాని ట్రూడో ట్వీట్ చేయటం మరో విశేషం. 1967లో నైరోబిలోని ఒక భారత సంతతి (గుజరాత్‌) కుటుంబంలో జమాల్‌ జన్మించారు.బ్రిటన్‌లోనే ఆయన బాల్యం గడిచింది.అనంతరం జమాల్ కుటుంబం 1981లో కెనడాకు వలస వెళ్లింది.గతంలో తాను పేరు, మతం, చర్మ రంగు ఆధారంగా ఎన్నో సార్లు వేధింపులకు, వివక్షకు గురైనట్లు జమాల్‌ పేర్కొన్నారు. ఎన్నో సార్లు..ఎన్నో సందర్భాల్లో వర్ణ వివక్ష ఎదుర్కొన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఇప్పుడు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి న్యాయమూర్తిగా నామినేట్ కావ‌డం ఎంతో గ‌ర్వ‌ంగా ఉంద‌ని తెలిపారు. ఇక జస్టిన్ ట్రూడో ప్రభుత్వం లో భారతీయులు కీలక పదవులను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే.కొద్దిరోజుల క్రితం భారత సంతతికి చెందిన ఎంపీ మనీందర్ సిద్ధూని సైతం ప్రధాని ట్రూడో కీలక పదవిలో నియమించారు.అంతర్జాతీయ అభివృద్ధి మంత్రి కరీనా గౌల్డ్‌కు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.భారత సంతతికే చెందిన కెనడా ఎంపీ కమల్ ఖేరా.గతంలో కరీనా గౌల్డ్ పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.