Begin typing your search above and press return to search.
భారత దౌత్యాధికారి జేబులో ఉంది పదేనంట
By: Tupaki Desk | 3 April 2016 9:19 AM GMTదేశానికి ప్రాతినిధ్యం వహించే సందర్భంలో తొందరపాటు అస్సలు పనికి రాదు. ఏమాత్రం తేడా వచ్చినా దేశ పరువు ప్రతిష్ఠలకు జరిగే నష్టం అంతాఇంతా కాదు. కానీ.. ఇలాంటి విషయాల్ని కీలక స్థానాల్లో ఉన్న వారు మర్చిపోతుంటారు. తాజాగా అలాంటి పనే చేసి విమర్శల పాలయ్యారు భారత దౌత్యాధికారి గౌతమ్ బంబవాలే. ఇస్లామాబాద్ లోని కెహ కేషన్ హాల్లో పాక్ లోని ఆక్స్ ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ సొసైటీ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది.
పాక్.. అఫ్గాన్ సంబంధాలపై అఫ్గాన్ రాయబారి ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అతిధులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. వేదిక మీద ఒక డ్రాప్ బాక్స్ పెట్టి.. ఆ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క అతిధిని కనీసం రూ.500 తగ్గకుండా విరాళాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత రాయబారి గౌతమ్ డ్రాప్ బాక్స్ దగ్గరకు వెళ్లి తన జేబులో నుంచి రూ.10 నోటును అందులో వేశారు.
దీన్ని చూసిన పలువురు గుసగుసలాడుకోగా.. సొసైటీ ఛైర్మన్ ఖాన్ మాత్రం ఓపెన్ గా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పదిరూపాయిలు ఇచ్చి కశ్శీర్ అంశాన్ని పరిష్కరించాలని మీరెలా అనుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. గౌతమ్ తీరును పలువురు తప్పు పట్టగా.. ఆయన మాత్రం తనజేబులో పది రూపాయిలు మాత్రమే ఉన్నాయని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. నిజంగానే గౌతమ్ జేబులో డబ్బులు లేకుంటే.. తమ సహాయకుల నుంచి తీసుకొని వేయొచ్చు. లేదంటే.. మూసుకొని కూర్చున్నా బాగుండేది. కానీ.. పది రూపాయిల నోటు వేయటం ద్వారా అందరిలో పలుచన కావటమే కాదు.. దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేలా వ్యవహరించారని చెప్పొచ్చు.