Begin typing your search above and press return to search.

ఇండియన్ ఎకానమీ బూస్ట్.. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..!

By:  Tupaki Desk   |   2 Dec 2022 5:30 PM GMT
ఇండియన్ ఎకానమీ బూస్ట్.. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..!
X
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయాయి. మన చిన్నప్పటి నుంచి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలువబడుతోంది. మనకంటే వెనుకలా స్వాతంత్య్రం పొందిన దేశాలు అభివృద్ధిలో దూసుకెళ్తుంటే మనం మాత్రం ఇంకా వెనుకబడే ఉండటం పాలకుల చేతగానితనానికి నిదర్శనంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అయితే భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నాయి. అయితే విదేశీ పెట్టుబడులు.. కంపెనీలు భారత్ కు ఇటీవలీ కాలంలో పెద్దమొత్తంలో తరలి వస్తుండటంతో 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇండియా మారడం ఖాయమని మోర్గాన్ స్టాన్లీ తాజాగా అంచనా వేసింది. ఇది ఒక రకంగా భారతీయులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.

భారత్ ను ఎగుమతుల కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని మోర్గాన్ స్లాన్లీ పేర్కొంది. అలాగే భారత్ తయారీ హబ్ గా అవతరిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ జీడీపీలో తయారీ రంగం వాటా 2031 నాటికి 21 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.

ఈ రంగం మీద 447 బిలియన్ డాలర్ల ఆదాయం నుంచి 1490 బిలియన్ డాలర్లకు చేరుతుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. భారత్ కు విదేశీ కంపెనీలు క్యూ కడుతుండటం.. తయారీ రంగంలో.. ఇంధన రంగంలో వస్తున్న మార్పులు.. డిజిటల్ మౌలిక సదుపాలయాలన్నీ కూడా భారత్ ఆర్థిక వ్యవస్థను మరింతగా బూస్ట్ చేస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణలు కూడా వీటికి దోహదం చేస్తున్నాయని వెల్లడించారు. 2031 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు సగటున 6.3 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. ఈ క్రమంలోనే భారత్ 2030 నాటికి జపాన్.. జర్మనీని వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.