Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయం ఖాళీ.: అసలేం జరుగుతోంది..?

By:  Tupaki Desk   |   2 March 2022 8:30 AM GMT
ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయం ఖాళీ.: అసలేం జరుగుతోంది..?
X
రష్యా, ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడు రోజులుగా రష్యా కీవ్ పై దండెత్తి ప్రధాన కార్యాయాలయాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక తరువాతి టార్గెట్ ను ఖార్కీవ్ ను ఎంచుకుంది. ఇప్పుడ ఖర్కీవ్ ను రష్యా బలగాలు చుట్టు ముట్టి ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి.

ఈక్రమంలో ఉక్రెయిన్లోని భారత పౌరులను ఇండియాకు తెప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా..ఖార్కీవ్లో చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి వారిని స్వదేశానికి రప్పించేందుకు వైమానిక దళాలను రంగంలోకి దించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ ప్రింగ్లా స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విమానాలు ఖార్కీవ్ కు బయలుదేరాయి.

ఉక్రెయిన్ పై రష్యా దాడి ముందుగానే పసిగట్టిన భారత్ కీవ్ లోని కార్యకాలపాలను కట్టడి చేశాయి. ఇందులో భాగంగా భారత ఎంబసీ కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. ఇక కీవ్ లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులను ఖాళీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. యుద్ధం పతాక స్థాయికి చేరుకున్న సమయంలో భారత్ కు సంబంధించిన అధికారులు కీవ్ ను ఖాళీ చేశారు. ఇక్కడి నుంచి సురక్షితంగా ఉన్న పశ్చిమ ప్రాంతానికి వెళ్లారు. వెస్టర్న్ రీజియన్ లోని ల్వీవ్ నగరం నుంచి తమ కార్యాకలాపాలు సాగించాలని నిర్ణయించారు.

ల్వీవ్ సిటీ పొలెండ్ సరిహద్దుల్లో ఉంటుంది. కీవ్ లోని విద్యార్థులను సైతం ఇక్కడికి రప్పించిన అధికారులు ఇక్కడి నుంచి భారత్ కు తరలిస్తున్నారు. ప్రస్తుతానికి ల్వీవ్ నగరం ఒక్కటే సురక్షితంగా ఉందని, విదేశీయులందరూ ఇక్కడికే చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా రష్యా సైన్ం భారత్ ఖార్కీవ్ నగరాన్ని చుట్టుముట్టడంతో ఇక్కడి వారంతా ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే రష్యా సైనికులు ఈ నగరాన్ని నామరూపాల్లేకుండా చేశాయి. ఈ నగరంపై రష్యా సైనికులు చేసిన దాడితో కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే.

అయితే ఖార్కీవ్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత్ అప్రమత్తమైంది. ఇక్కడున్న పౌరులు, విద్యార్థులను తరలించడానికి సీ-17 గ్లోబ్ మాస్టర్ ను పంపించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విమానం ఢిల్లీ నుంచి ఇప్పటికే బయలుదేరింది. సీ -17 నేరుగా రొమేనియా రాజధాని బుడాపెస్ట్ కు చేరుకుంటుంది. సీ-17తో పాటు ఎయిరిండియా సహా ఇతర ప్రైవేట్ విమానయాన సంస్థలను కూడా కేంద్ర ప్రభుత్వం బరిలో ఉంచనుంది. మొత్తం 26 విమాన సర్వీసులనుు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇక్కడి అధికారుతు తెలుపుతున్నారు.

ఇప్పటివరకు 12 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటి పొరుగు దేశాలకు చేరుకున్నట్లు హర్షవర్దన్ ప్రింగ్లా తెలిపారు. అయితే ఉక్రెయిన్లో ఇంకా వేలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు కీవ్,ఖార్కీవ్ తో పాటు సుమీ నగరాల్లో ఉన్నట్లు సమాచారం. అక్కడున్న వారందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు విద్యార్థులు కీవ్ నగరాన్ని వెంటనే వీడాలని భారత అధికారులు సూచనలు చేస్తున్నారు. ఏమాత్రం జాప్యం చేయకుండా ఏదో రకంగా ఈ నగరాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.