Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్‌కు షాకిచ్చిన మనోడు
By: Tupaki Desk | 15 Jun 2022 5:30 AM GMTతాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించే ధోరణి.. ప్రపంచ కుబేరుడు కమ్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు కాస్త ఎక్కువే అన్న విషయం తెలిసిందే. ఏదైనా విషయం మీద అతగాడు ఒక స్టాండ్ తీసుకుంటే దాన్ని మార్చుకోవటానికి ససేమిరా అనే పరిస్థితి. భారత్ లో తన కార్లను తీసుకొచ్చే విషయంలో ఇదే తీరును ప్రదర్శించి.. భారీ మార్కెట్ అవకాశాల్ని అంతకంతకూ తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే.
భారత్ లోకి తన విద్యుత్ కార్లను తీసుకొచ్చేందుకు టెస్లా ఆసక్తి చూపటం.. అందుకు భారత సర్కారు ఓకే చెప్పటం వరకు అంతా బాగానే సాగినా.. తర్వాత ఎలాన్ మస్క్ తీరుతో ఆ ప్రక్రియ పీటముడులు పడిందని చెప్పాలి. దిగుమతి సుంకాన్ని తగ్గించాలని.. భారత మార్కెట్ మీద అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే దేశంలో కార్ల ఉత్పత్తిని మొదలు పెడతామని చెప్పటం.. దానికి మోడీ సర్కారు ఒప్పుకోకపోవటం తెలిసిందే.
తాము చెప్పినట్లే చైనా సర్కారు ఒప్పుకుందంటూ టెస్లా చేసిన వాదనకు మోడీ సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో.. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. భారత సర్కారు తీరుపై తనకున్న అసంతృప్తి వెళ్లకక్కటం ద్వారా వాతావరణాన్ని మరింత వేడెక్కించారనే చెప్పాలి. ఇదంతా జరగటానికి భారత్ లో తమ కంపెనీ తరఫున ఒక ప్రతినిధిని నియమించింది టెస్లా. 2021లో జరిగిన ఈ నియామకం.. భారత్ లో టెస్లా చేసిన తొలి నియామకంగా చెప్పాలి.
ఐఐఎం బెంగళూరుకు చెందిన మనుజ్ ఖురానాను పాలసీ అండ్ బిజినెస్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా నియమించింది. మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ లో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న మనుజ్.. భారత్ లో టెస్లా తొలి ఉద్యోగి కూడా ఆయనే. ఎలాన్ మస్క్ కు.. మోడీ సర్కారుకు మధ్యనున్న దూరాన్ని తగ్గించేందుకు మనుజ్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయితే.. ఈ ఎపిసోడ్ లో ఇరు వర్గాల్లో ఏ ఒక్కరు వెనక్కి తగ్గకపోవటంతో అడుగు ముందుకు పడలేదు.
భారత ప్రభుత్వం తాను చెప్పినట్లుగా వినకపోవటం టెస్లా అధినేతకు కోపం వచ్చింది. అందుకే ఆయన భారత్ ఎంట్రీని పక్కకు పెట్టి.. ఇండోనేషియా.. థాయ్ లాండ్ మీద ఫోకస్ పెట్టారు. భారత్ లో షోరూం కోసం వెతికే ప్రయత్నాల్ని నిలిపివేయటంతో.. మనుజ్ కు ఆగ్రహానికి గురైనట్లుగా తెలుస్తోంది.
అందుకే.. టెస్లాకు గుడ్ బై చెబుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. భారత్ లో తాను నియమించిన మొదటి.. కీలక ఉద్యోగి తన పదవికి రాజీనామా చేయటం టెస్లాకు షాకేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.