Begin typing your search above and press return to search.

అమెరికాలో నేరాలను ఎదుర్కోవడానికి భారతీయ యజమాని సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   8 Dec 2022 3:29 AM GMT
అమెరికాలో నేరాలను ఎదుర్కోవడానికి భారతీయ యజమాని సంచలన నిర్ణయం
X
అమెరికాలో ప్రవాసులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బాగా సంపాదిస్తున్న భారతీయులపై తుపాకులు చూపించి బెదిరించడాలు.. చంపి భారీగా నగదు, బంగారం దోచుకెళుతున్నారు. ఈ తంతు కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది.

ఫిలడెల్ఫియాలోని భారతీయ అమెరికన్ గ్యాస్ స్టేషన్ యజమాని నీల్ పటేల్ ఈ నేరాలతో విసిగిపోయి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన వ్యాపారం కోసం ఉన్నత స్థాయి సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నాడు.

ఈ భారతీయ యజమాని అమెరికాకు వచ్చిన విద్యార్థులకు సహాయంగా ఉపాధి కల్పిస్తున్నాడు. చాలా మంది భారతీయ విద్యార్థులు గ్యాస్ స్టేషన్‌లలో పని చేస్తున్నారు. ఇటీవల అమెరికాలోని భారతీయులే లక్ష్యంగా కాల్పులు వరుసగా జరుగుతున్నాయి. సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాల్పులు పెరిగాయి.

ఈ క్రమంలోనే భారతీయ వ్యాపారి నీల్ పటేల్ నార్త్ ఫిలడెల్ఫియాలోని తన కార్కో గ్యాస్ స్టేషన్‌ లో తన ఉద్యోగులు.. కస్టమర్‌లకు నేరస్థుల నుండి అంతులేని బెదిరింపులు వచ్చిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పటిష్టమైన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయించాడు. బుల్లెట్ ఫ్రూఫ్ దుస్తులు, ఏఆర్-15 గన్ లు ధరించిన పెన్సిల్వియా ఎస్ఐటీయూ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెంట్‌లను నియమించుకున్నాడు.

బెదిరింపులు, దోపిడీలు, మాదక ద్రవ్యాల రవాణా, రెక్కీలతో విసిగిపోయామని.. అందుకే తమకు తాము ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నామని.. తుపాకీలతో బెదిరింపులకు కౌంటర్ గానే దీన్ని ఏర్పాటు చేసినట్టు నీల్ పటేల్ తెలిపారు. ఇటీవలే నీల్ వ్యాపారాన్ని ఒక ముఠా ధ్వంసం చేసి ఏటీఎం మెషీన్ మరియు అతని కారును దొంగిలించిన తరువాత తాజాగా ఇలా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు.

ఈ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు శిక్షణ పొందారు. వారి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. తుపాకీలను, వారి టేజర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసు. వీరికి చట్టం తెలుసు. తాను అత్యున్నత స్థాయి, రాష్ట్ర స్థాయి భద్రతను నియమించుకోవలసి వస్తోందని, కాపలాగా రక్షణ కల్పించాలని ఇలా చేశానని నీల్ పటేల్ చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.