Begin typing your search above and press return to search.
న్యూయార్క్ లో కరోనాకు ఓ భారతీయ కుటుంబం బలి
By: Tupaki Desk | 26 April 2020 4:17 AM GMTఅగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమవుతోంది. కరోనా మహమ్మారితో కోలుకోలేని విధంగా ఆ దేశం పరిస్థితి తయారైంది. లక్షల సంఖ్యలో కరోనా బారిన ప్రజలు పడుతుండగా వేలాది సంఖ్యలో కరోనాను ఎదుర్కొనలేక మృత్యువాత పడుతున్న సంఘటనలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. అయితే అమెరికాలో పెద్ద సంఖ్యలో ఇతర దేశాల ప్రజలు కూడా నివసిస్తున్నారు. ఈక్రమంలో కరోనా బారిన ఇతర దేశాల ప్రజలు కూడా పడుతున్నారు. వారిలో అమన భారతీయులు కూడా భారీగానే ఉన్నారని సమాచారం. లెక్కలు తెలియదు.. కానీ అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి పెద్దసంఖ్యలో భారత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన ఓ కుటుంబం కరోనా వైరస్ తో మృతిచెందారు.
కేరళకు చెందిన కె.జె.జోసెఫ్ తన కుటుంబంతో కలిసి అమెరికాలోని న్యూయార్క్ లో నివసిస్తున్నారు. న్యూయార్క్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ నగరంలో లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. ఆక్రమంలో జోసెఫ్ కుటుంబంలో ఒకరికి కరోనా సోకింది. ఆ వచ్చిన వారి ద్వారా కుటుంబంలోని అతడి భార్య ఎలియమ్మ జోసెఫ్ - బావ ఈపెన్ జోసెఫ్ తో పాటు వారిద్దరి పిల్లలకు కరోనా వ్యాపించింది. దీంతో వారిని అక్కడి అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కె.జె.జోసెఫ్ - భార్య ఎలియమ్మ జోసెఫ్ - బావ ఈపెన్ జోసెఫ్ తో మృతిచెందారు. కరోనా బారిన కుటుంబంలోని ముగ్గురు మృతిచెందడంతో ఆ కుటుంబసభ్యులు దిగ్ర్భాంతికి గురయ్యారు. అయితే కరోనా సోకిన ఇద్దరు పిల్లలు మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.