Begin typing your search above and press return to search.
రాకాసి అలలతో భారతీయ కుటుంబం బలి.. వీడియో వైరల్!
By: Tupaki Desk | 14 July 2022 4:47 AM GMTగల్ఫ్ దేశమైన ఒమన్ లో విషాదం చోటు చేసుకుంది. విహారానికి ఒక బీచ్ కు వెళ్లిన ఒక భారతీయ కుటుంబంలో ముగ్గురు రాకాసి అలలకు బలయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని సంఘ్లీకి చెందిన షాహికాంత్ దుబాయిలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈద్ సెలవుల్లో భాగంగా ఆయన తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఒమన్ లో ధోఫర్‌లోని అల్ ముగ్‌సైల్ బీచ్ లో విహార యాత్రకు వెళ్లారు.
అలా వారు సముద్రపు ఒడ్డున నిల్చొని సందడిగా గడిపారు. అయితే ఇంతలో ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకాసి అలలు ఇద్దరు పిల్లలు శ్రేయాస్, శ్రేయలను లోపలకు లాగేశాయి. కళ్ల ముందే తన కుమార్తె, కుమారుడు కొట్టుకుపోవడాన్ని చూసిన తండ్రి షాహీకాంత్ అప్రమత్తమై వారిని కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కాస్త ముందుకెళ్లడంతో ఆయన కూడా అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయారు.
ఒడ్డున ఉన్న భార్య, కూతురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని శశికాంత్ సోదరుడు, న్యాయవాది రాజ్ కుమార్ కూడా ధ్రువీకరించారు.
ఈ ప్రమాదంలో శశికాంత్, అయన కుమారుడు శ్రేయాస్ (9) మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమార్తె శ్రేయ కోసం పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.
మరోవైపు అక్కడ కంచె ఉందని.. కంచె దాటి వారు ఫొటోలు తీయడానికి ప్రయత్నించినప్పుడు భారీ ఎత్తున వచ్చిన అలలకు వారు కొట్టుకుపోయారని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఘటన స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు తీవ్ర దిగ్భాంతి చెందారు.