Begin typing your search above and press return to search.
ఆ జనవరి 26న భారీ సర్ ప్రైజ్
By: Tupaki Desk | 2 Dec 2016 5:32 AM GMTకొన్ని అంశాలతో నేరుగా ఎలాంటి సంబంధం లేకున్నా.. తీవ్రమైన భావోద్వేగానికి గురి అవుతుంటాం. ఇలాంటి ఉద్వేగాల్ని తట్టి లేపటంతో పాటు.. భారత కీర్తి పతాకాల్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఒక స్టార్టప్ విపరీతంగా ప్రయత్నిస్తోంది. అయితే.. దాని ప్రయత్నం ఇప్పటికిప్పుడే ఒక కొలిక్కి రాకున్నా.. రానున్న రోజుల్లో మాత్రం ఈ ప్రయత్నం దేశ ప్రజల్ని ఆకర్షిస్తుందనటంలో సందేహం లేదు.
వచ్చే ఏడాది కాదుకానీ.. ఆ పై వచ్చే ఏడాది అంటే.. 2018 జనవరి 26న ఒక భారీ కార్యక్రమానికి టీమ్ ఇండస్ అనే స్టార్టప్ ఒక భారీ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఒక ప్రత్యేకమైన అంతరిక్ష నౌకను చంద్రుడి మీదకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నౌకను చంద్రుడి మీద పంపటం ద్వారా ఒక స్టార్టప్ ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందన్న విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని భావిస్తోంది.
ఈ కార్యక్రమం కోసం దాదాపు 320 టన్నుల భారీ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపటానికి కాను.. ఇస్త్రోకు చెందిన యాంత్రిక్స్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చంద్రుడిపై అంతరిక్ష నౌకను ఏదైనా ప్రైవేటు సంస్థ విజయవంతంగా ల్యాండ్ చేయగలిగితే సదరు సంస్థకు 20 మిలియన్ డాలర్లు ఇస్తానని 2007లో గూగుల్ పేర్కొంది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన టీమ్ ఇండస్ ఒక కంపెనీలా ఏర్పడి తమ ప్రయత్నాల్ని షురూ చేస్తున్నారు. వారు అనుకున్నట్లే జరగాలని.. ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుందాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/