Begin typing your search above and press return to search.
ఈ అమ్మాయి గురించి తెలిస్తే షాక్ తినాల్సిందే
By: Tupaki Desk | 15 Nov 2016 10:30 PM GMTచాలామంది భారతీయులకు ఆ అమ్మాయి ఎవరో అస్సలు తెలీదు. ఆ అమ్మాయి పేరు చెబితే.. అయితే ఏందని అంటారు. కానీ.. లండన్ లో ఆ అమ్మాయి గురించి అందరికి తెలుసు. అంతేకాదు.. ఆమె చేసే పనుల గురించి చాలా ఆసక్తిగా చర్చించుకుంటారు. ఆమెకున్న గుండె ధైర్యానికి అబ్బుర పడిపోతుంటారు. ఒక ఐటీ కంపెనీకి ఓనరైన ఆమె.. పర్యావరణం కోసం.. మానవత్వం.. సమానత్వం కోసం ఆమె చేసే పనులు వింటే షాకింగ్ గా ఉండటమే కాదు.. నిజామా? అని ఒక పట్టాన నమ్మమంటే నమ్మం. ఇంతకీ ఆ అమ్మాయి పేరేమిటంటే మీనాల్ జైన్.
లండన్ నివాసి అయిన ఈ భారతీయ మహిళ తాను నమ్మిన సిద్దాంతాల కోసం నగ్నంగా బయటకు వస్తారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా.. ఎలాంటి అడ్డు పెట్టుకోకుండా సైకిల్ మీద అలా వెళ్లి పోతుంటారు. పుట్టినప్పుడు.. పోయేటప్పుడు ఒంటి మీద నూలుపోగు ఉండదు. అలాంటిది మధ్యలో నగ్నత్వాన్ని ఎందుకు అనుసరించకూడదని ప్రశ్నిస్తారు. మధ్యలో వచ్చే దుస్తుల్ని లైట్ తీసుకునే ఆమె.. గతంలో బీచ్ లలో.. సైకిల్ ర్యాలీలలో నగ్నంగా ఉండి చాలామందికి నోట మాట రాకుండా చేసింది.
నగ్నత్వం మీద ప్రచారం మొదలు పెట్టిన ఆమె.. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కోసం ఒక నగ్న ర్యాలీ జరిగింది. ఇందులో ఒంటి మీద నూలు పోగు లేకుండా సైకిల్ ర్యాలీ నిర్వహించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. పర్యావరణానికి.. నగ్నత్వానికి లింకేమిటన్న విషయం చాలామందికి ఎంత ఆలోచించినా బుర్రకు తట్టకున్నా.. ఆమె మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండా తనకు నచ్చిన చోట.. నగ్నంగా దర్శనమిస్తూ తన దారిన తాను వెళుతుంటుంది.ఈ అమ్మడు నగ్నత్వం మీద తన తత్వాన్ని చెప్పేందుకు ఒక బ్లాగ్ కూడా ఓపెన్ చేసింది సుమా.