Begin typing your search above and press return to search.
యూత్ బాక్సింగ్ లో భారత్ అమ్మాయిల సత్తా !
By: Tupaki Desk | 23 April 2021 10:01 AM GMTపోలండ్ కీస్ వేదికగా జరుగుతున్న యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత బాక్సర్లు స్వర్ణాలతో హోరెత్తిస్తున్నారు. భారత బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టాడు. పోలండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత మహిళా బాక్సర్లు ఏడు స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నారు. గీతిక (48 కిలోలు), బేబిరోజిసనా చాను (51కి), పూనమ్ (57కి), వింకా (60కి), అరుంధతి (69కి), సనామచు చాను (75కి), అల్ఫియా (+81కి) పసిడి పతకాలతో మెరిశారు. ఈ మెగా ఈవెంట్ లో భారత్ కు ఇది అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
ఫైనల్స్‌లో గీతిక 5-0తో కుజెస్కా (పోలెండ్)పై, బేబీరోజిసనా 5-0తో లింకోవా (రష్యా)పై, పూనమ్ 5-0తో గ్రోషీ (ఫ్రాన్స్)పై గెలిచారు. వింకా.. కజకిస్థాన్‌కు చెందిన షయక్మెతోవాను ఓడించింది. అరుంధతి 5-0తో బార్బరా (పోలెండ్)పై, అల్ఫియా 5-0తో కొజోరెజ్ (మాల్దోవా)పై నెగ్గింది. ఇక చాను కజకిస్థాన్ అమ్మాయి డానా డిడేను మట్టికరిపించింది. ప్రపంచ యువ బాక్సింగ్ మహిళల విభాగంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2017లో ఐదు స్వర్ణాలతో సాధించిన రికార్డును అధిగమించింది. ఈ టోర్నీలో మరో భారత బాక్సర్ ఫైనల్లో పోటీపడాల్సివుంది. పురుషుల విభాగంలో సచిన్ (56 కేజీ) శుక్రవారం పోటీలో నిలవనున్నాడు.