Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ లో కామాందుల వివరాలు!
By: Tupaki Desk | 10 April 2015 2:30 PM GMTఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్నిరకాల శిక్షలు అమలవుతున్నాయని తెలిసినా... మహిళలపై అత్యాచారాలు, వేదింపులూ తగ్గడం లేదు సరికదా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటువంటి నేరాలు చేసిన వారి వివరాలను ఇకపై ప్రజలకు తెలియచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న పిల్లలపై, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ... అత్యాచారాలు చేసేవారి వివరాలు ఇకపై ప్రపంచం మొత్తానికి అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఆన్ లైన్ లో ఒక డేటా బేస్ క్రియేట్ చేయనున్నారు. ఇప్పటివరకూ కేవలం పోలీస్ స్టేషన్ లోనో లేక క్రైం రికార్డులలోనో మాత్రమే కనబడే వీరి వివరాలను ప్రజలకు తెలియపరచాలని కేంద్రం యోచిస్తోంది.
ఇందుకోసం మేనకా గాంధీ నేతృత్వంలోని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. కేంద్ర హోం శాఖ సహకారంతో దేశవ్యాప్తంగా చిన్నారులను వేధింపులకు గురిచేసిన వారి వివరాలు వెల్లడించడం ద్వారా సిగు పడి, బుద్ది తెచ్చుకోవాలనే తమ అభిమతమని... ఈ దిశగా ప్రణాళికలు రూపొందించామని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఈ తరహా డేటా బేస్ నిర్వహిస్తున్నాయి. దీని వలన చాల వరకు నేరాలు తగ్గుముఖం పడతాయని మేనక గాంధీ ఆశభావం వ్యక్తం చేసారు.