Begin typing your search above and press return to search.
ఆ దేశాలకు భారత్ గట్టి షాకిచ్చింది
By: Tupaki Desk | 26 Jun 2017 7:48 AM GMTస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మొదలుకొని ప్రస్తుత కాలం వరకు కూడా మనదేశం విదేశాలతో కయ్యం పెట్టుకోవడానికి అస్సలు ఆసక్తి చూపించదు. ఇంకా చెప్పాలంటే ఇబ్బందికరమైన పరిస్థితిని ఏ దేశమైనా సృష్టించినా సంయమనంతోనే పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేసిన సందర్భాలను మనం గమనించవచ్చు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. మంచితనం చేతకాని తనంగా భావిస్తున్న నేపథ్యంలో దెబ్బకు దెబ్బ తీసేందుకు భారతదేశం సిద్ధమైంది. అంటే యుద్ధానికి దిగుతోందా అనుకోకండి. దౌత్య విధానాలు - విదేశాంగ నిబంధనల సాకుతో తమ దేశ పౌరులను కెలికితే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో తాజాగా రుచి చూపించింది.!
ఇంతకీ విషయం ఏమిటంటే..మన దేశానికి వచ్చే విదేశీయులే తీసుకునే వీసాల ఫీజులను పెంచేసింది. అమెరికా - ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ వంటి దేశాలు ఇటీవల వీసాల విషయంలో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు షాక్ ఇచ్చాయి. ఇలా వివిధ దేశాలు ఇటీవల భారతీయులకు దెబ్బేసేలా ఫీజులను పెంచిన నేపథ్యంలో భారత్ కొద్దికాలం క్రితమే అమెరికా - కెనడా - యూకే - ఇజ్రాయిల్ - ఇరాన్ - యూఏఈ దేశస్తులకు వివిధ కేటగిరీల్లో ఫీజులు పెంచింది. పీజుల పెంపును ఖరారు చేస్తూ కేటగిరీల వారీగా వివరాలు ఇస్తూ తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను వెలువరించింది.
ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ - కెనడా - ఐర్లాండ్ - ఫ్రాన్స్ - థాయ్ లాండ్ దేశస్తులు ఉద్యోగ వీసాలకు 300 డాలర్లకు బదులు ఇకనుంచి 459 డాలర్లు చెల్లించాలి. పర్యాటక వీసాలకు ఇప్పటివరకు ఉన్న 100 డాలర్ల ఫీజును 153 డాలర్లకు పెంచింది. అంటే మన కరెన్సీలో రూ.6450 నుంచి 9868 వరకు పెరిగిందన్నమాట. ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు చెల్లుబాటయ్యే వీసాలకు ప్రస్తుతం 120 డాలర్లు పీజు ఉండగా 306 డాలర్లకు పెంచారు. అయితే స్వల్ప మినహాయింపులను కల్పించింది. యూకే పౌరులపై పెద్ద ఎత్తున భారం పడకుండా 162 డాలర్ల నుంచి 248 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/