Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ తో యుద్ధం తప్పదా

By:  Tupaki Desk   |   4 Jan 2016 11:24 AM GMT
పాకిస్థాన్ తో యుద్ధం తప్పదా
X
కొద్దికాలంగా ఊహించని పరిణామాలతో భారత్ - పాక్ దేశాల మధ్య చిగురిస్తున్న స్నేహానికి సవాల్ గా మారిన ఉగ్రవాదుల విషయంలో భారత్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్నేహం సంగతి తరువాత భద్రత ప్రధానం అన్న ఉద్దేశంతో పాక్ కు గట్టి హెచ్చరికలు పంపించింది. మూడు రోజుల్లో ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోతే తాము రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించింది.

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ భారత్ పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలను మూడు రోజుల్లోగా తుదముట్టించాలని... లేకపోతే తీవ్రపరిణామాలు తప్పవని ఇండియా పాక్ కు హెచ్చరించింది. పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై భీకర ఉగ్రదాడి తరువాత భారత్ ఇక కఠిన వైఖరి వ్యవహరించకతప్పదన్న నిర్ణయానికి వచ్చింది. ఆ క్రమంలోనే పాక్ లో ఉన్న ఉగ్రవాద సంస్థల పని పడితేకానీ శాంతి నెలకొనది పేర్కొంది. లష్కర్ ఎ తోయిబా - జైషే మహ్మద్ వంటి సంస్థలపై 72 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి సమాచారం పంపించింది. అవసరమైతే భారత వాయుసేన సహకారాన్ని తీసుకుని ఉగ్రవాదులపై దాడులు చేయయాలని సూచించింది.

ఒకవేళ పాకిస్థాన్ నుంచి సానుకూల స్పందన రాకపోయినా, భారత్ ఆందోళనను అర్థం చేసుకోలేకపోయినా కూడా చర్చల ప్రక్రియ మొత్తానికే నిలిచిపోవడం ఖాయమని పేర్కొంది. అంతేకాదు... పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా ప్రత్యక్ష దాడులకు దిగుతుందని కూడా చెప్పారు. పాకిస్థాన్ నుంచి దీనిపై ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. పాక్ కనీసం చర్యలు తీసుకోవడమో.. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయకుంటే పీఓకేలో ఇండియా దాడులు చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇది యుద్ధానికి దారి తీసినా తీొయచ్చని భావిస్తున్నారు. ఇండియా దాడులకు దిగితే షరీఫ్ కు ఇష్టమున్నా లేకున్నా పాక్ ఆర్టీ స్వీయ నిర్ణయంతో యుద్ధానికి రావొచ్చని అనుకుంటున్నారు.