Begin typing your search above and press return to search.
మన హ్యాకర్ల చర్యకు పాక్ దిమ్మతిరిగింది
By: Tupaki Desk | 15 Aug 2017 12:02 PM GMTభారత సత్తాను తక్కువగా చేసే పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగగిలింది. అది కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా! పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆ దేశానికి చెందిన 500 వెబ్ సైట్లను భారత హ్యాకర్లు హ్యాక్ చేశారు. అందులో కీలకమైన ప్రభుత్వ వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. హ్యాక్ చేసిన తర్వాత అందులో భారత్ అనుకూల నినాదాలను వెబ్ సైట్లలో హ్యాకర్లు పోస్ట్ చేశారు. పాకిస్థాన్ కు చెందిన కీలక మంత్రిత్వ శాఖల వెబ్ సైట్లు ఈ హ్యాకర్ల చరయలకు ప్రభావితమయ్యాయి.
పాకిస్థాన్ కు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖతోపాటు వాతావరణ మార్పులకు సంబంధించిన శాఖ - నీరు - విద్యుత్ మంత్రిత్వశాఖ - సమాచార - సాంకేతిక మంత్రిత్వశాఖల వెబ్ సైట్లు హ్యాకయ్యాయి. కొన్ని వెబ్ సైట్లు ఇంకా పనిచేయడం లేదు. భారత్ కు చెందిన హ్యాక్లర్లే వీటిని హ్యాక్ చేసినట్లు పాక్ సమాచార మంత్రిత్వశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. పాక్ ప్రభుత్వం మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. పాక్ వెబ్ సైట్లను హ్యాక్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2016, అక్టోబర్ లోనూ భారత్‌కు చెందిన హ్యాకర్లు పాక్ ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాక్ చేశారు.