Begin typing your search above and press return to search.
ట్రంప్ కుమారుడి వ్యాపారం..దిమ్మతిరిగే ధరలు
By: Tupaki Desk | 19 Feb 2018 1:19 PM GMTఇటీవలి కాలంలో భారత్ కు అన్నీ చేదు కబుర్లే వినిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అనూహ్యమైన కబురు ఇచ్చారు. ఆయన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మనదేశంలో వ్యాపారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన త్వరలో భారత పర్యటనకు రానున్నారు. పూర్తిగా ఇది తన వ్యక్తిగత వ్యాపారానికి సంబంధించిన పనుల నిమిత్తం మాత్రమే ఇక్కడి వస్తున్నాడు. ప్రాపర్టీ ఇన్వెస్టర్లు - వారి కుటుంబ సభ్యులు అతని కోసం ఏర్పాటు చేసిన విందుకు కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో విలాసవంతమైన ట్రంప్ టవర్స్‌ను నిర్మిస్తున్నారు. ఐతే ఈ భారీ ప్రాజెక్టును స్థానిక డెవలపర్లతో ఒప్పందం చేసుకొని అభివృద్ధి చేస్తున్నాడు. ట్రంప్ టవర్‌లో ఫ్లాట్ ను కొనుగోలు చేసేందుకు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడితో విందు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామని ప్రమోటర్లు ప్రచారం కూడా చేస్తున్నారు. 47 అంతస్తుల టవర్ లో మొత్తం 250 హోమ్స్ ఉండగా..దీన్ని వచ్చే 2023లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ప్రముఖ వ్యాపారవేత్తలు - ప్రముఖ భారత క్రికెటర్ తో పాటు పలువురు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అత్యంత తక్కువ ధర కలిగిన ఫ్లాట్ ను కొనుగోలు చేయడానికి డౌన్ పేమెంట్ కింద దాదాపు 2.5కోట్లు చెల్లించాలి. వీటి ధర రూ.5.5 కోట్ల నుంచి రూ.11కోట్ల మధ్య ఉంది. ఇప్పటి వరకు 75 మంది బుక్ చేసుకున్నారని గురువారం వరకు డెడ్ లైన్ ఉందని అప్పటి వరకు ఆ సంఖ్య 100కు చేరుతుందని ట్రిబికా సంస్థ ఉద్యోగి ఒకరు వెల్లడించారు.
కాగా, అమెరికా తర్వాత ట్రంప్‌కు భారీ ప్రాజెక్టులు ఉన్నది భారత్ లోనే. జూనియర్ ట్రంప్ తన పర్యటనలో దేశంలోని నాలుగు నగరాలు ముంబయి - పుణె - గురుగ్రామ్ - కోల్ కతాను సందర్శించనున్నట్లు తెలిసింది. స్థానిక డెవలపర్లకు తమ బ్రాండ్ ట్రంప్ ను వాడుకునేందుకు ట్రంప్ ఆర్గనైజేషన్ అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా వచ్చిన లాభాల్లో కొంత వాటా కూడా తీసుకోనుంది. మీడియా రిపోర్టుల ప్రకారం అన్ని ప్రాజెక్టులు పూర్తికావడానికి దాదాపు 1.5 బిలియన్ అమెరికా డాలర్లను ఖర్చు చేయనున్నారు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం భారత్ లో 2016లో వేసిన వెంచర్ల ద్వారా రాయాల్టిల కింద ట్రంప్ కుటుంబానికి దాదాపు 3మిలియన్ అమెరికా డాలర్లు వచ్చినట్లు తన కథనంలో పేర్కొంది. తన తండ్రి అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రస్తుతం ట్రంప్ కంపెనీలను డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చూసుకుంటున్నాడు. కాగా, ఢిల్లీలో ఆయనది అనధికార పర్యటనేనని అమెరికా దౌత్యకార్యాలయం కూడా స్పష్టం చేసింది.