Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ దెబ్బ ...ఉద్యోగుల్ని పీకేస్తున్న పలు కంపెనీలు !
By: Tupaki Desk | 23 May 2020 1:30 AM GMTఈ వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో అనేక సంస్థలు తమ ఉద్యోగుల్ని తీసివేస్తున్నాయి. దాదాపుగా రెండు నెలలుగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో వారికీ జీతాలు ఇవ్వలేక వారిని వదిలించుకోవడానికే ఇష్టపడుతున్నాయి. దీనితో ఇప్పటికే ఉద్యోగుల కోత మొదలైంది. ముఖ్యంగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ యాజమాన్యాలు ఉద్యోగులకు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆన్ లైన్ పుడ్ డెలివరీ సంస్థ జొమాటో 13శాతం ఉద్యోగులను తీసివేయగా , స్విగ్గి 14 శాతం ఉద్యోగుల్ని తీసేసింది.
గత రెండు నెలలుగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ 60-70% తగ్గింది. ఎందుకంటే చాలా రెస్టారెంట్లు హోటల్స్ లాక్ డౌన్ కారణంగా మూసివేశారు. అలాగే ఉన్న ఉద్యోగుల జీతాల్లో కూడా కోతలువిధించాయి. ఓలా తన ఉద్యోగుల 25% మందికి ఇప్పటికీ ఉద్వాసన పలికింది.అలాగే షేర్ చాట్ 25% లీవ్ స్పేస్ 15% , కల్ట్ ఫిట్ 10% ఉద్యోగులను తొలగించాయి. అటు బ్లాక్ బక్ , ఉడాన్ కంపెనీలు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకోవడం తో పాటు ఉన్న ఉద్యోగుల జీవితాల్లో కోతలు విధించాయి. దీనితో రోజురోజుకి దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.