Begin typing your search above and press return to search.

యూఎస్ లో భారతీయుడికి 10 ఏళ్ల జైలు.. ఏంచేశాడంటే

By:  Tupaki Desk   |   26 Aug 2021 4:30 AM GMT
యూఎస్ లో భారతీయుడికి 10 ఏళ్ల జైలు.. ఏంచేశాడంటే
X
చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవ‌ల ఇలాంటి వ‌రుస ఘ‌ట‌న‌లు చూస్తుంటే.. మనిషిలోని మానవత్వం నిజంగానే మాయమైపోతుందా, వాయి వరుసలు మర్చిపోయి మనిషి మృగంలా మారిపోతున్నాడా, అన్న భయం కలుగుతోంది. ఇలాంటి మానవమృగాలని అరికట్టడానికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో ఓ భారతీయుడికి కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

ప్రదీష్ జెహాన్ సెల్వరాజ్ అనే భారతీయుడు ఇద్దరు బాలికలను ప్రలోభపెట్టి ట్రాప్ చేయడానికి ప్రయత్నించి అమెరికా పోలీసులకు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇద్దరు బాలికలను ట్రాప్ చేయటానికి యత్నించిగా వ్యూహాత్మకంగా వల పన్నిన పోలీసులు ప్రదీష్ జైహాన్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా అతనికి యూఎస్ న్యాయస్థానం 10ఏళ్ల జైలుశిక్ష విధించింది. శిక్ష పూర్తి అయ్యాక దేశం వదిలిపెట్టిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎంతోమంది భారతీయులు అమెరికాకు చదువుల కోసం వెళతారు. చదువు పూర్తి అయ్యాక ఉద్యోగంలో చేరి బాగా సంపాదించాలని అనుకుంటారు. కానీ అటువంటి అవకాశం అందరికీ రాదు. వచ్చినవారు సద్వినియోగం చేసుకోవాలి. అలా చేయకుండా వేరే ట్రాక్ లో పడితే ఇదిగో ఇలా ప్రదీష్ జైహాన్ లాగా జైలులో గడపాల్సి వస్తుంది. అమెరికాలోని ఒమాహాలో నివసించే ప్రదీష్ జెహాన్ సెల్వరాజ్. 35 ఏళ్ల సెల్వరాజ్ బాలికలను ప్రలోభ పెట్టి వారి తో లైంగిక సంబంధాలు పెట్టుకునే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా 2020 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 4 మధ్య 15 సంవత్సరాల బాలికను ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడు.

ఆన్‌ లైన్‌ లో కనిపించిన ఒక వ్యభిచార అడ్వర్‌టైజ్‌మెంట్‌ను చూసిన సెల్వరాజ్ స్పందించాడు. ప్రకటనలో ఇచ్చిన నంబరుకు మెసేజ్ చేశాడు. ఇలా మైనర్లను ప్రలోభ పెట్టే వారిని పట్టుకోవడం కోసం పోలీసులే ఆ యాడ్ పెట్టిన ఉచ్చులో చిక్కుకున్నాడు. సెల్వరాజ్‌ మెసేజ్ లకు ఒక పోలీసు అధికారిణి 15 ఏళ్ల బాలికలా స్పందించింది. ఈ క్రమంలో ఆ బాలికకు సెల్వరాజ్ 80 డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.6వేలు చెల్లించడానికి అంగీకరించాడు. ఈ డబ్బుతో ఆ బాలికతోపాటు మరో 12 ఏళ్ల బాలికతో ఓరల్‌ సెక్స్ కోసం ఒప్పందం చేసుకున్నాడు.

ఈ ఇద్దరు అమ్మాయిలను ఒమాహాలో కలవడానికి రెడీ అయిన సెల్వరాజ్ మహా ఉత్సాహంగా వెళ్లాడు. ఇద్దరమ్మాయిలకు మెక్‌ డొనాల్డ్స్ బ్రేక్‌ ఫాస్ట్ తీసుకొస్తానని చెప్పి, వారు కలవాలని అనుకున్న ఏరియాకు పట్టుకెళ్లాడు. అదే సమయంలో అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ప్రదీష్ వద్ద ఉన్న కండోమ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును కోర్టులో హాజరుపరచగా, విచారణ జరిపిన కోర్టు ప్రదీష్‌ కు 120 నెలలు అంటే 10 ఏళ్లు జైలుశిక్ష విధించింది. ఆ తర్వాత మరో ఐదేళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించింది. అతన్ని సెక్సువల్ అపెండర్‌ గా రికార్డు చేయాలని, శిక్ష పూర్తయిన తర్వాత ప్రదీష్‌ ను అమెరికా నుంచి బహిష్కిరించి, స్వదేశానికి పంపేయాలని కోర్టు వెల్లడించింది.